2 నుంచి ‘అఖిల భారత ఆర్టీసీ కబడ్డీ టోర్నమెంట్‌’

2 నుంచి ‘అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ టోర్నమెంట్‌’

ఈ టోర్నమెంట్‌కు టీఎస్‌ఆర్టీసీ ఆతిథ్యం

హకీంపేట ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో మూడు రోజుల పాటు నిర్వహణ

హైదరాబాద్ : ‘ఆలిండియా పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కబడ్డీ టోర్నమెంట్‌-2023’ గురువారం నుంచి ప్రారంభం కాబోతుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌(ఏఎస్‌ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్‌ శివారు హకీంపేటలోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్‌ జరుగుతుంది.

ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్‌ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్దన్ గారు, ఎండీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు తెలిపారు. ఈ కబడ్డీ టోర్నమెంట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్‌ ముంబై, పుణే మహానగర్‌ పరివాహన్‌, బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ ట్రోఫీ కోసం మొత్తంగా 9 జట్లు తలపడనున్నాయని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

‘ఆలిండియా పబ్లిక్‌ బస్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ కబడ్డీ టోర్నమెంట్‌-2023’ను హకీంపేటలోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీలో గురవారం ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ శ్రీ సి.హెచ్. ద్వారక తిరుమలరావు, ఐపీఎస్‌ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారితో పాటు సంస్థ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!