14 మంది మావోయిస్టులు లొంగుబాటు
భద్రాద్రి, నిర్దేశం:
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 14 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి, రెండు నెలల్లో 94 మంది మావోయిస్టు సభ్యుల లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామని అయన అన్నారు. ముగ్గురు మహిళలు , 11 మంది పురుషు మావోయిస్టులు లొంగిపోయారు.