AP 39TV 15 ఏప్రిల్ 2021:
అనంతపురం జిల్లా గుడిబండ మండలం PHC లో అప్పుడే పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడం లో కష్టంగా ఉన్నందున గుడిబండ నుండి 108 లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వెనుతిరిగి వస్తున్న సందర్భంలో108 వహనాన్ని నీలకంఠాపురం గ్రామంలో పరిశీలించిన మాజీ మంత్రి రఘువీరా.108 వాహనంలో ఉన్న స్థితిగతులు మరియు వాహనంలో ఉన్న పరికరాల గురించి వాహనం లో ఉన్న పైలెట్లను ఈ.ఎం.టి లను అడిగి అందులో ఉన్న అధునాతన మైన బీఎల్‌ఎస్ అంబులెన్స్‌ల లో స్పైన్ బోర్డు, స్కూప్ స్ట్రెచర్, వీల్ ఛైర్, బ్యాగ్ మాస్క్, మల్టీ పారా మానిటర్ వంటి సదుపాయాలు ఏర్పాటును చూసి ఆయన మెచ్చుకొన్నారు.మరియు BP పేసేంట్ల కి ఏర్పాటు చేసిన సిరేంజ్ ఇన్ఫోయూజ్ పంపు మరియు పాయిజన్ ఫిట్స్ కేసులకు ఏర్పాటు చేసిన తక్షణ అపరేటర్స్ వంటి సదుపాయాలను చూసి ఆయన ఎంతగానో మెచ్చుకొన్నారు.నాడు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ, 104,108 వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు.ఈనాడు మరో ముందడుగు వేసి అందులో ఉన్న అధునాతన మైన బీఎల్‌ఎస్ అంబులెన్స్‌లలు రూపుదిద్దుకొని ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తూన్నాయి అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.