మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
నల్గోండ, నిర్దేశం :
మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు నల్లగొండ జిల్లా పోలీసులు. ఇటీవల హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి వెంట ఓ దాబా ముందు ఆగిన ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికుడి బ్యాగ్ నుంచి 25 లక్షల దొంగతనం జరిగింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు, హోటల్ లోని సిసి కెమెరాలను పరిశీలించగా.. ఓ కారులో వచ్చిన నలుగురు దుండగులు.. ట్రావెల్స్ బస్సులోకి వెళ్లి.. రెండు నిమిషాల్లోనే బ్యాగు తో తిరిగి కారులో ఎక్కి పరారైన దృశ్యాలు కనిపించాయి. ఇది అంతర్:రాష్ట్ర దొంగల ముఠా పని అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్.. నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆఖరికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మన్వార్ తాలూకా, రాళ్ళ మండల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్ ను అరెస్టు చేసి.. 25 లక్షల రూపాయల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.