నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. వైసీపీ నాయకులు, జగన్ అభిమానులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఆయన్ను బెదిరించేలా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తాజాగా తనకు తాను వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకున్న కడపకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాల్ చేసి.. ‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు కూడా నీ కంటే ఎక్కవగా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొడతారు. డేట్ ఫిక్స్ చేసుకో.. సీఎం జోలికి వచ్చినవంటే… బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీలోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా’.. అంటు అనిల్ బెదిరింపులకు దిగాడు.
కోటంరెడ్డి తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడని.. వెంటనే వచ్చి సీఎం జగన్‌కి క్షమాపణ చెప్పాలంటూ అనిల్ బెదిరింపులకు పాల్పడ్డారు. సజ్జల సహా ఇతర పార్టీ పెద్దల గురించి మాట్లాడితే మాత్రం మీ కథ తేలుస్తా అంటూ కోటంరెడ్డిని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని తాను ఏమీ అనలేదని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా ’అనిల్ బుతులు తిడుతుతో బెదిరింపులకు దిగాడు. ఈ విషయం చెబుతూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.