Take a fresh look at your lifestyle.

అమెరికాలో ఉద్యోగానికి రాంరాం.. ఒక్క నెలలో 45 లక్షల మంది రాజీనామా

0 94

అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గతేడాది నవంబరులో ఏకంగా 45 లక్షల మందికిపైగా ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు ఆ దేశ కార్మికశాఖ పేర్కొంది. ఇలా ఉద్యోగాలు మానేస్తున్న వారి సంఖ్య సెప్టెంబరుతో పోలిస్తే 3 శాతం పెరిగినట్టు తెలిపింది.

ఇక ఉద్యోగాలు వదులుకుంటున్న వారిలో ఫుడ్ సర్వీసెస్ కార్యకలాపాలు నిర్వహించేవారే ఏకంగా 1.59 లక్షల మంది ఉన్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. వీరి తర్వాతి స్థానంలో ఆరోగ్య సంబంధిత రంగాల వారు 52 వేల మంది, రవాణా సేవలకు సంబంధించిన వారు 33 వేల మంది ఉన్నట్టు పేర్కొన్నాయి.

అదే సమయంలో నవంబరులో ఏకంగా 1.6 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్టు కార్మికశాఖ తెలిపింది. ఉద్యోగాలను వదిలేస్తున్న కార్మికులు అధిక వేతనం లభించే మార్గాలవైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, ఫలితంగా జాబ్ మార్కెట్ పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి 1.85 కోట్ల మంది ఉపాధి పొందారని, ప్రస్తుతం నిరుద్యోగిత రేటు 4.2 శాతం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
Tags: USA, Unemployment, Jobs Resign

Leave A Reply

Your email address will not be published.

Breaking