ఇంద్రవెల్లి అమరులకు నివాళులు అర్పించిన వైయస్ షర్మిల

ఇంద్రవెల్లిలో అమరులకు

నివాళులు అర్పించిన వైయస్ షర్మిల

ఇంద్రవెల్లి, (ఆదిలాబాద్) ఏప్రిల్ 20 : 42 సంవత్సరాల క్రితం ఇదే ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలు వాళ్ల భూమి మీద హక్కుల కోసం కొట్లాడినందుకు వాళ్ల మీద బుల్లెట్ల వర్షం కురిపించారన్నారు వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.  ఇంద్రవెల్లిలో అమరులైన ఎంతోమంది అమరులకు, వీరనారీలకు నివాళులు అర్పించడానికి ఇంద్రవెల్లి రావడం జరగిందన్నారు ఆమె. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన వారికి ఈ వీరులకు సలాం.. వారి పోరాటానికి .. ఆ పోరాటం జరిగిన ఇంద్రవెల్లి గడ్డకు సలాం అన్నారు షర్మిల.

ఒకప్పుడు జలియన్ వాలాబాగ్ దురంతంలో తెల్లదొరలకు బలి అయిపోతే ఆ తర్వాత స్వతంత్ర్య భారతదేశంలో ఇంద్రవెల్లిలో ఎంతోమంది ఇక్కడ ఆదివాసీలు బలైతే ఈరోజు మళ్లీ స్వరాష్ట్రంలో బంగారు తెలంగాణని ఉద్యమకారుడైన కేసీఆర్ గారి మాట నమ్మి మళ్లీ బలవుతూనే ఉన్నారన్నారు ఆమె.

కేసీఆర్ ఎంత మందిని చిత్రహింసలకు గురిచేశారు.

కేసీఆర్ భూమి లేని గిరిజనులకు భూమి ఇవ్వకపోగా మాటిచ్చి తప్పి కూడా ఇప్పుడు అసెంబ్లీలో నిల్చొని అడవి బిడ్డలు దొంగలైనట్లు భూమి కబ్జా చేసుకుంటున్నారన్నట్లు అసలు వాళ్లకు అడవీ భూములపై హక్కుల లేదన్నట్లు దయతలచి ప్రభుత్వం ఇస్తేనే తీసుకోవాలని అన్నట్లు మాట్లాడుతున్నారన్నారు షర్మిల. అసలు ఆ భూములు కబ్జా చేయము అని ఒక అఫిడవిట్ అడుగుతున్నారంటే అసలు కేసీఆర్ ను మనిషి అనుకోవాలా? అని ప్రశ్నించారు ఆమె. ముఖ్యమంత్రి అయి ఉండి అడవి బిడ్డలను దొంగలను చేసి మాట్లాడుతున్నారన్నారు షర్మిల.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!