నిద్ర‌పోవ‌డం, ముద్దుపెట్ట‌డం ఉద్యోగ‌మే.. ప్రపంచంలోని 5 వింత ఉద్యోగాలు

నిర్దేశం, స్పెష‌ల్ డెస్క్ః “పడుకో నాయ‌నా.. హాయిగా పడుకో, నిద్రపోయినందుకు నీకు డబ్బులిస్తాం” అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది? లేదా మీరు కేవలం కన్నీళ్లు పెట్టుకున్నందుకు వేల రూపాయలు వ‌స్తే? ఇదీ కాదు. డిగ్రీ లేకుండా రిలాక్సయ్యే ఉద్యోగం సంపాదిస్తే? ఉన్న‌ట్టుండి మీ జీతం ఒక్క‌సారిగా పెరిగితే ఎలా భావిస్తారు? బహుశా ఇలాంటి ఉద్యోగం ఉంటే ఎంత బాగుండో అనిపిస్తోంది క‌దా. అయితే ఈ రకమైన ఉద్యోగం నిజంగానే ఉందండి బాబోయ్.

అవును, ప్రపంచంలో వింతైన ఉద్యోగాలు ఉన్నాయి. నిద్ర‌పోవ‌డం, ఏడవడం లేదా కౌగిలించుకోవడం లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగాల‌కు కూడా జీతం గ‌ట్టిగానే వ‌స్తుంది. మ‌రి, ప్రపంచంలోని ఇలాంటి వింత ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.

ప్రొఫెష‌న‌ల్ స్లీపర్

విచిత్రమైన ఉద్యోగాలలో ఇద‌ బంగారం లాంటిద‌నే చెప్పొచ్చు. ఇందులో మీరు గంటల తరబడి నిద్రించినందుకు డబ్బు చెల్లిస్తారు. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ ప్రొఫెషనల్ స్లీపర్ గా ఉద్యోగం ఉన్న మాట మాత్రం నిజం. రోజంతా నిద్రపోవడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఫిన్‌లాండ్‌లోని ఒక హోటల్‌లో ప్రొఫెషనల్ స్లీపర్‌లను నియమించుకుంటారు. ఈ ఉద్యోగం కింద, ఉద్యోగి ప్రతి రాత్రి హోటల్‌లోని అన్ని గదుల్లో పడుకోవాలి. మంచం ఎలా ఉంది? అలాగే రూం సౌక‌ర్యాలేంటో చూడాలి. హోటల్‌లు తమ కస్టమర్ల నుండి ఎటువంటి ఫిర్యాదులను వినడానికి ఇష్టపడవు, అందుకే వారు ప్రొఫెషనల్ స్లీపర్‌లను నియమించుకుంటారు.

ఏడుపు

మీరు ఏడ్చినందుకు కూడా మంచి జీతం పొందవచ్చు. వాస్తవానికి, ఆగ్నేయాసియాలో అనేక కంపెనీలు అంత్యక్రియల వద్ద ఏడ్చే వ్యక్తులను నియమించుకుంటాయి. ఇందుకోసం దాదాపు రూ.8 వేల వేతనం కూడా ఇస్తారు. ఇక్కడి ఉద్యోగి అంత్యక్రియల సమయంలో వెళ్లి ఏడవాల్సి వస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఏడ్చే సంప్రదాయం ఉందని, దీని కోసం ప్రొఫెష‌న‌ల్ క్రైయర్లను నియమిస్తున్నారు.

అద్దె ప్రియుడు

బాయ్‌ఫ్రెండ్‌గా ఉండటం కూడా ఒక ఉద్యోగమే. దీనికి మంచి జీతం కూడా ఇస్తారు. జపాన్‌లోని టోక్యో నగరంలో బాయ్‌ఫ్రెండ్ అద్దెకు దొరుకుతారు. నిజానికి, తమ ఒంటరితనాన్ని అధిగమించడానికి, ఇక్కడి ప్రజలు బాయ్‌ఫ్రెండ్‌లను అద్దెకు తీసుకుంటారు. వారితో కాలక్షేపం చేస్తారు. అంటే తినడం, తిర‌గ‌డం లాంటివ‌మ‌న్న‌మాట‌. దీని ఖర్చులు కిరాయిదారు భరించాలి. జపాన్‌తో పాటు, ఇతర దేశాలలో కూడా అద్దె బాయ్‌ఫ్రెండ్ ఉద్యోగం ప్రారంభమైంది.

క్యూలో ఉద్యోగం

తెలిస్తే ఆశ్చర్యపోతారు కానీ లైన్‌లో నిలబడటం కూడా ఒక పని అనే మాట మాత్రం నిజం. లైన్‌లో నిలబడటానికి వ్యక్తులను నియమించుకునే కంపెనీలు చాలా ఉన్నాయి. యాపిల్ ఉత్పత్తి విడుదల నుండి బ్లాక్ ఫ్రైడే విక్రయం లేదా ఏదైనా ఇతర ప్రత్యేక సందర్భం వరకు, అక్కడ నిలబడటానికి మ‌నుషుల‌ను కంపెనీలు అద్దెకు తీసుకుంటాయి. ఇందుకోసం మంచి మొత్తం ఇస్తారు.

ప్రొఫెష‌న‌ల్ కార్ వాచర్

ప్రపంచంలోని వింతైన, సులభమైన ఉద్యోగాలలో ఒకటి కారు వాచ్ ఉద్యోగం. ఇందులో మీరేమీ చేయాల్సిన పనిలేదు, సరైన స్థలంలో కారు పార్క్ చేసిందా లేదా అనేది చూడాలి. సూటిగా చెప్పాలంటే, మీరు కారుని పర్యవేక్షించవలసి ఉంటుంది. ఇందుకు కూడా మంచి జీత‌భ‌త్యాలు ఉంటాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!