పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన ప్రపంచ బ్యాంకు
నిర్దేశం, లాహెర్ :
జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తరువాత వెంటనే భారతదేశం పాకిస్థాన్‌తో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ తరువాత నుంచి పొరుగు దేశం ఆందోళన చెందుతోంది. తమపై భారత్ యుద్ధాన్ని ప్రకటించిందని చెబుతోంది. దీనిపై ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. ఈ విషయంపై ప్రపంచ బ్యాంకు స్పందించింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడుతూ… ప్రపంచ బ్యాంకుకు ఉన్నవి పరిమిత అధికారాలని ఆ విషయంలోనే ఒప్పందంపై సంతకం చేసిందని, ఒప్పందంపై సభ్య దేశాలచే తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని అది వాళ్ల సార్వభౌమాధికార నిర్ణయమని దాని విషయంలో అభిప్రాయాలు వ్యక్తం చేయబోమని అన్నారు.ఈ ఒప్పందం నిలిపివేసిన తరువాత, దేశ ప్రజల మనసుల్లో ఒక ప్రశ్న మెదులుతోంది. ఈ ఒప్పందం నిలిపివేయడం వల్ల పాకిస్థాన్‌కు ఎంత నష్టం జరుగుతుంది. రెండు దేశాల మధ్య సింధు జల ఒప్పందం అర్థం ఏమిటి? పాకిస్థాన్ ఎంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది?.
ఈ విషయం గురించి వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్ కేంద్ర జల కమిషన్ మాజీ అధిపతి కుశ్విందర్ వోహ్రాతో మాట్లాడింది. సింధు జల ఒప్పందం నిలిపివేసిన తరువాత మనం పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ పని అయినా చేసుకోవచ్చు అని ఆయన అన్నారు.సింధు జల ఒప్పందం ప్రకారం ఇప్పటివరకు మనం కొన్ని విషయాలకు బాధ్యత వహించాం, కానీ మనం ముందుగా ఈ ఒప్పందంలో ఏ నదులు ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. ఈ ఒప్పందంలో ఆరు నదులు ఉన్నాయని ఆయన అన్నారు. రావి, బియాస్ సట్లెజ్ నదుల పూర్తి నీరు భారతదేశానికి చెందినది. అంతేకాకుండా సింధు, జీలం, చినాబ్ నదులలో ఎక్కువ నీరు పాకిస్థాన్‌కు చెందినది.1960లో ఈ ఒప్పందం జరిగింది. దీనిలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కానీ ఒప్పందం నిలిపివేసిన తరువాత ఇప్పుడు ఎటువంటి బాధ్యత లేదు. ఇప్పుడు నిలిపవేసిన తరువాత డేటాను పంచుకోవలసిన అవసరం లేదు. భారత్-పాక్ కమిషన్ల మధ్య సమావేశాలు జరగవు. అంతేకాకుండా పాకిస్థాన్ అధికారులు, ప్రజలు ఇక్కడ నిర్మించే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారో అని తెలుసుకునేందుకు వచ్చే వాళ్లు. ఇప్పుడు దాని అవసరం లేదు.మనం చేసే ప్రాజెక్టుల గురించి కూడా వారికి సమాచారం ఇవ్వాల్సి వచ్చేది. పాకిస్థాన్ సాధారణంగా మన ప్రాజెక్టులలో లోపాలను వెతకేది, కానీ ఇప్పుడు ఆ సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదు. వర్షాకాలంలో, భారతదేశం సింధు నది వ్యవస్థలో వరద పరిస్థితి గురించి పాకిస్థాన్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వదు. ఈ సింధు జల ఒప్పందం నిలిపివేసినంత కాలం పాకిస్థాన్‌కు ఇబ్బందులు ఉంటాయని నేను అనుకుంటున్నాను.