మహిళలు చైతన్యంతో పాలకుల కండ్లు తెరిపించాలి

మహిళలు చైతన్యంతో పాలకుల కండ్లు తెరిపించాలి

: న్యూడెమోక్రసీ నేత దాసు 

నిజామాబాద్, మార్చి 11 :  మహిళలు చైతన్యముతో పోరాడిపాలకుల కండ్లు తెరిపించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లిలో మహిళా దినోత్సవం మహమ్మదీ, గంగక్క ఆధ్వర్యంలో మార్చ్ 11న నిర్వహించారు.

మహిళలపై రోజు దాడులు జరగడం బాధగా ఉందని వాళ్ళు అన్నారు. దాసు పాల్గొని మాట్లాడుతూ మహిళలకు భద్రత కరువైందని వివక్షత పెరిగిందని ఆయన అన్నారు విద్యార్థులు బడికి వెళ్లి మహిళలు బయటకు వెళ్లి ఇంటికి రావడం గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచారాలు కట్టుబాట్లు స్త్రీని వంటింటికి పరిమితం చేస్తున్నాయని,పురుషాధిక్యతతో మహిళలు అనేక సమస్యలు భరిస్తున్నారని ఆయన తెలిపారు. విద్యా వైద్య రంగాల్లో వెనుకబడి మహిళలపై దాడుల్లో దేశం ముందున్నదని ఆయన అన్నారు.

భారతమాతకు జై అంటూ నినదిస్తున్న కొందరు కేంద్ర మంత్రులు మహిళలపై దాడులు నియంత్రించకుండా ఆడపిల్లల దుస్తుల అలంకరణ పై వక్రీకరణ వ్యాఖ్యానాలు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. దేశంలో గంటకు నలుగురు పై లైంగిక దాడులు 10 నిమిషాలకు ఒక కిడ్నాప్ 30 నిమిషాలకు అత్యాచారం అత్యా జరుగుతున్న పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. జై భారత మాత అంటూ దేశంలో అనేకమంది భారతమాతలు నేలన రాలుతున్న ఎందుకు స్పందించడం లేదనికేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

మోడీ అచ్చేదిన్ అంటూ సిలిండర్ గ్యాస్ ధరలను 450 రూపాయల నుండి 1150 రూపాయలకు పెంచి మహిళలపై భారం వేయడం బాధ్యతరాహిత్యంమని ఇది సచ్చేదిన్ కాదా? అని ఆయన నిలదీశారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడకుండా మహిళలు ఐక్యంగా ఉద్యమించి పాలకులకు తగిన బుద్ధి చెప్పి హక్కులను రక్షించుకోవాలని ఆయన సూచించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రతిన బూనీ, పాలకులకు జ్ఞానోదయం కలిగేటట్లు ఉద్యమించాలని దాసు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు అనిత, లక్ష్మి, షహదా, సుల్తానా, భాను పి వై ఎల్ నాయకులు వెంకటేష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!