మహిళా సాధికారత ఒక్క మోదీతోనే సాధ్యం : బండిసంజయ్‌

మహిళా సాధికారత ఒక్క మోదీతోనే సాధ్యం : బండిసంజయ్‌

హైదరాబాద్‌, నిర్దేశం:

మహిళా సాధికారత ఒక్క ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోనే సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలు శక్తి స్వరూపాలని అభివర్ణించారు. స్త్రీలను అత్యంత గౌరవిస్తూ అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. రాష్ట్రపతి, ఆర్ధిక మంత్రిగా మహిళలకు బాధ్యతలు అప్పగించిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. ‘మహిళా శక్తి’ అంటే పెద్దపెద్ద ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితమవడమా అని ప్రశ్నించారు. మహిళలకు ప్రతినెలా రూ.2500లు హామీ ఏమైందని రేవంత్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. తులం బంగారం, స్కూటీ హామీలు ఎటు పోయాయని బండి సంజయ్‌ కుమార్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. బెల్టు షాపుల నిర్మూలన వాగ్దానం ఏమైందన్నారు. తెలంగాణ మహిళలు రాణిరుద్రమదేవి వారసులు అని బండి సంజయ్‌ కుమార్‌ కొనియాడారు. మహిళలను మభ్యపెట్టే పాలకులకు కర్రు కాల్చివాత పెట్టడం తథ్యమని హెచ్చరించారు. మహిళలు అంటే అమ్మవారి శక్తి స్వరూపాలు… సృష్టికి మూల కారకులు అని ప్రశంసలు కురిపించారు. కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో ఏమీ ఆశించకుండా పిల్లల ఎదుగుదలకు జీవితాన్నే త్యాగం చేసేది తల్లి మాత్రమే అని చెప్పారు. అక్కా చెల్లెళ్ల రూపంలో, భార్యగా తోడునీడగా నిలిచేది స్త్రీ మూర్తులే అని చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని బండి సంజయ్‌ కుమార్‌ ఉద్ఘాటించారు. ‘మహిళా దినోత్సవం నాడు మాత్రమే మహిళలను పొగిడి… ఆ తర్వాత వారిని విస్మరించే పార్టీ బీజేపీ కానే కాదు. స్త్రీలను లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీ. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఈ దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన పార్టీ బీజేపీ. ఏ మహిళల చేతిలో డబ్బు ఉందో ఆ కుటుంబం, ఆ దేశం సురక్షితంగా, ప్రగతి పథంలో నడుస్తుందని నమ్మి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆచరిస్తున్నారు. మహిళకు ఆర్ధిక మంత్రి పగ్గాలు అప్పగించడంతో పాటు కేంద్ర కేబినెట్‌లో, ప్రభుత్వ పదవుల్లో సముచిత భాగస్వామ్యం కల్పించారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను కట్టించి మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇంటి తాళాలు అప్పగించడంతోపాటు మరో మూడు కోట్ల ఇళ్లను నిర్మించి మహిళలకు మోదీ అందజేయడానికి సిద్ధమయ్యారు. మహిళల పేరుతో ఎనిమిది కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు, ఇరవై ఐదు కోట్ల మంది స్త్రీలకు జన్‌ ధన్‌ బ్యాంక్‌ అకౌంట్లు, దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది మహిళలకు 10 లక్షల కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలిచ్చి నా అక్కా చెల్లెళ్లు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తూ మహిళా శక్తికి అసలైన నిర్వచనం చెబుతూ మహిళా సాధికారత అంటే ఏమిటో చేతల్లో చూపుతున్న మహనీయుడు మోదీ’ అని బండి సంజయ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. దేశంలోని 11 కోట్ల మందికి ఉజ్వల కనెక్షన్లు అందించి కట్టెల పొయ్యి బాధ లేకుండా చేసి మోదీ మహిళల కంట కన్నీరు తుడిచారు. భేటీ బచావో.. భేటీ పడావో, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »