డీసీపీ వెంకటేశ్వర్లు సస్పెండ్ తో తెరపైకి ఎన్నో విషయాలు..

 ఎన్నికల కమీషన్ సీరియస్

ముగ్గురు పోలీసు అధికారుల సస్పెండ్

 అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందిగా నిర్వహించడంలో భాగంగా ఎన్నికల కమీషన్ కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పోలీసు శాఖలోని కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల కమీషన్ ప్రత్యేకంగా నిఘా పెట్టింది.

అందులో భాగంగానే ముషిరాబాద్ బీఆర్ ఎస్ అభ్యర్థికి చెందిన 16 లక్షల 50 వేల రూపాయలను గుర్తించిన పోలీసు అధికారులు సరిగ్గా విచారణ చేయలేరని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమీషన్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసు కమీషనర్ సందీప్ శాండిల్యాకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీపీ సందీప్ శాండిల్యా ప్రాథమిక విచారణ చేసిన తరువాత నిర్లక్ష్యం చేశారని డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, ఎసీపీ యాదగిరి, సీఐ జహంగీర్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వూలను జారీ చేశారు.

అక్రమంగా డీసీపీ ప్రమోషన్ లేఖ

సీఎం ఆశీస్సులతో డీసీపీ ప్రమోషన్ లేఖ

డీసీపీ వెంకటేశ్వర్లు సస్పెండ్ తో

తెరపైకి ఎన్నో విషయాలు..

వడ్డిచ్చెటోడు మనోడైతే బంతిలో ఎక్కడున్న పుష్టిగా బోజనం పెడుతారనేది పాత సామెత.. ఇగో.. ఇప్పుడు సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లకు ఇది వంద శాతం వర్తిస్తోంది.  ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు అతి సన్నిహితుడిగా పేరున్న డీసీపీ ఎం వెంకటేశ్వర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్లనే ఎన్నికల కమీషన్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

 సస్పెండ్ తో తెరపైకి వెంకటేశ్వర్లు ప్రమోషన్…

 ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆశీర్వాదంతో ఎం.వెంకటేశ్వర్లు తన సర్వీసులో అతి ముఖ్యమైన పోస్ట్ లలో విధులు నిర్వహించారని పోలీసు శాఖలో టాక్. 1991 లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పోలీసు శాఖలోకి వచ్చిన అతను విధులు నిర్వహించే వారు. అప్పట్లో నక్సలైట్ల కార్యకలపాలు అధికంగా ఉండటంతో ఇతర సబ్ ఇన్ స్పెక్టర్ లాగానే నక్సల్స్ ఇలాకలో విధులు నిర్వహించారు. ఆ తరువాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా ఎసీపీగా, అడిషనల్ డీసీపిగా ప్రమోషన్ పొందారు.

 చట్ట విరుద్దంగా డీసీపీ ప్రమోషన్..?

 రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా అనేది పాత సామెత.. ఇప్పుడు సీఎం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ చాలా సులువు అనేది నేటి సామెత.. ఇగో… వెస్ట్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు ప్రమోషన్ పొందిన తీరును ఇందుకు నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండటంతో నిబందనలకు విరుద్దంగా ఎం. వెంకటేశ్వర్లకు ప్రమోషన్ ఇచ్చారనేది పోలీసు శాఖలో చర్చా ప్రారంభమైంది.

29 ఏళ్ల క్రితం పని చేశారని ప్రమోషన్..?

29 ఏళ్ల క్రితం నక్సలైట్ల కార్యకలపాలను నిర్మూలించడంలో పోలీసు ఆఫీసర్ గా విధులు నిర్వహించారని అతనికి ఇటీవల డీసీపీ గా ప్రమోషన్ ఇచ్చారు. అయితే.. ఎం. వెంకటేశ్వర్లకు ప్రమోషన్ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు ఎవరు కూడా రికమెండ్ చేయలేరు. అయినప్పటికీ సీఎం ప్రత్యేక శ్రద్ద తీసుకుని అతనికి ఎగ్జలరీ ప్రమోషన్ పేరుతో 29 ఏళ్ల క్రితం నక్సలైట్ల కార్యకలపాలను అణచడని ప్రభుత్వం ప్రమోషన్  ఇచ్చింది. అయితే.. సీఎం ఆశీస్సులు ఉండటంతో పోలీసు శాఖలోని ఇది అన్యాయం అని ఎవరు కూడా నోరు మెదపలేక పోయారు.

 డీసీపీ ప్రమోషన్ తో తోటి బ్యాచ్ వారికి నష్టం..?

 ఎం వెంకటేశ్వర్లకు 29 ఏళ్ల క్రితం నక్సలైట్ల కార్యకలపాలను అణిచి వేశాడని ఇప్పుడు ప్రమోషన్ ఇవ్వడం చట్ట విరుద్దం అంటున్నారు పోలీసు అధికారులు. అతనికి ప్రమోషన్ ఇవ్వడంతో తమకు సీనియర్టీ ప్రకారం అన్యాయం జరుగుతుందని వారు బాధ పడుతున్నారు. సీఎం ప్రమోషన్ ఇచ్చినందుకు ఎం.వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం వల్లనే సస్పెండ్ కు గురయ్యారంటున్నారు పోలీసు అధకారులు.

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!