వేసవి లో గృహజ్యోతి లెక్కలు మారతాయా

వేసవి లో గృహజ్యోతి లెక్కలు మారతాయా
నిర్దేశం, హైదరాబాద్:
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వంద రోజుల్లో పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం అని గతంలోనే తెలిపారు రేవంత్ రెడ్డి. ఆయన సీఎం అయిన తర్వాత నుంచి ఇచ్చిన హామీలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం గృహజ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులు వస్తున్నాయి. రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడితేనే ఈ పథకానికి అర్హులు అవుతారు.

అయితే జీరో బిల్లులో యూనిట్లు, బిల్లు ప్రింట్ చేసి సబ్సిడీ కింద బిల్లును మాఫీ జీరోగా చూపిస్తున్నారుఈ మార్గదర్శకాలపై చాలా మందికి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అయితే దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారే ఈ పథకానికి అర్హులు అంటున్నారు అధికారులు. ఎవరైతే 200 యూనిట్ల కరెంట్ వాడుతారో వారు మాత్రమే అర్హులట. ఒకవేళ 201 యూనిట్లు దాటితే మొత్తానికి కరెంట్ బిల్ వేస్తారు. అంతేకాదు గతంలో కరెంట్ బిల్లులు చెల్లించకపోయినా కూడా ఈ జీరో బిల్ రాదు. మొత్తం కరెంట్ బిల్ క్లియర్ చేస్తేనే ఈ గృహజ్యోతికి అర్హులు అవుతారు.

గతంలో రికార్డులను పరిశీలిస్తే.. తెలంగాణలో 90 శాతం మంది 200 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ వాడేవారే ఉన్నారట. ఈ స్కీం వచ్చిన తర్వాత పొదుపుగా వాడేవారి సంఖ్య మరింత పెరిగిందని తెలుస్తోంది. మరి ఈ పథకానికి అర్హత పొందాలంటే..రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకొని 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించాలి.జీరో బిల్లులో యూనిట్ల బిల్లు ప్రింట్ చేసి బిల్లును మాఫీ చేసి జీరోగా చూపిస్తున్నారు. మరి మీరు కూడా ఇదే తరహాలో వాడండి. కానీ వేసవి వచ్చింది కాబట్టి ఈ సారి బిల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 200 యూనిట్ల లోపు మాత్రమే కాబట్టి ఫ్యాన్, కూలర్లు, ఏసీలు అంటూ ఎక్కువ సేపు వాడుతుంటే.. జీరో బిల్ రాదని తెలుస్తోంది. 200 యూనిట్లకు ఒక యూనిట్ పెరిగినా ఈ స్కీం వర్తించదు కాబట్టి ఎండకాలం కాస్త జాగ్రత్త సుమ.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »