బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా కుల గణాంకాలు ఎందుకు చేయలేదు?
బీజేపీ-బీఆర్ఎస్ లు కలిసి కుట్రలు చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
ఫ్రీ బస్, రైతు రుణమాఫీ, ఇతర పథకాలు నచ్చితేనే కాంగ్రెస్ అభ్యర్థి నరేదర్ రెడ్డి కి ఓటు వేయండి: సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్, నిర్దేశం:
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కలిసి చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. “ఇది ప్రజ ప్రభుత్వం, నాలుగు కోట్ల మంది ఆశలతో ఏర్పడినది. కానీ బీజేపీ-బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయి” అని ఆయన ఆరోపించారు.
సోమవారం నిజామాబాద్‌లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి కి మద్దతుగా జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ కుట్రలు ఆగడం లేదు…
“”తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారు, కానీ వారు కొత్త కుట్రలకు తెర లేపుతున్నారు” అని విమర్శించారు
గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏమి చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిపులకే తమ నడుములు వంగి పోతున్నాయని వాపోయారు
“కాంగ్రెస్‌ను ఓడించాలంటున్న బీఆర్ఎస్ ఎవరికి ఓటు వేయాలని చెబుతోంది? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలకు ఎదురు చూస్తున్న బి ఆర్ ఎస్ ముందుగా వచ్చిన ఏం ఎల్ సి ఎన్నికల లో పోటీ చేయడానికి చేయకలేదని ఎద్దేవ చేస్తూ బి ఆర్ ఎస్ హయం పార్టీ మారిన వారి సభ్యత్వాలు రద్దు కానప్పుడు ఇప్పుడు ఎలా రద్దు అవుతాయని ప్రశ్నించారు.
ఉద్యోగ నియామకాలు చెపట్టినాము కాబట్టి ఓట్లు అడుగుతున్నాము..
10 నెలల పాలనలో 55,163 ఉద్యోగాలు భర్తీ చేశారు.
11,000 టీచర్లు, 15,000 పోలీస్ ఉద్యోగాలు, 6,000 మెడికల్ సిబ్బంది నియామకాలు చేపట్టాము కాబట్టి పట్టభద్రుల ఓట్లు అడుగుతున్నామాని సి ఏం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రం లోని బి ఆర్ ఎస్ కేంద్రం లోని బి జే పి పాలనా లో పదేళ్లుగా నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే, మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాం” అని గర్వంగా వెల్లడించారు.యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఒలింపిక్స్‌కు అర్హులైన క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పారు.టాటా కంపెనీ సహకారంతో టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు కొత్త రూపం తీసుకొస్తున్నామని వెల్లడించారు..
బీజేపీపై విమర్శలు:
“బండి సంజయ్ నా కన్నా బడా బీసీ లేడంటున్నారు, నిజంగా బీసీల కోసం పనిచేస్తే బీసీ కుల గణనపై ప్రశ్నలు ఎందుకు?” అని నిలదీశారు.
బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు.
“గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లిం బీసీలకు రిజర్వేషన్లు ఉంటే, ఇక్కడ ఎందుకు లొల్లి?” అని ప్రశ్నించారు. “నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం ఉన్నప్పుడు 27 ముస్లిం కులాలను బీసీ జాబితాలో చేర్చారు. ఇప్పుడు బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది?” అని నిలదీశారు. “కుల గణనలో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దాలి, కానీ తప్పు ఎక్కడ ఉందో చెప్పకుండా అసత్య ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం?” అని బండి సంజయ్, కిషన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కే సి ఆర్ కే టి ఆర్ లను తప్పియ్యడానికే బి జే కి బి ఆర్ ఎస్ సహకారం...
“ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు అయిన ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విదేశాల నుంచి రప్పించకుండా బండి సంజయ్, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు” అని ఆరోపించారు.కేంద్ర హోం శాఖ మంత్రి అయిన బండి సంజయ్ ప్రయత్నిస్తే, నిందితుడు ఒక్క రోజులోనే రాష్ట్రానికి వచ్చేస్తాడు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ నేతల్ని రక్షించేందుకే అడ్డుకుంటోంది అని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో గొర్రెల పంపిణీ, ఈ-కార్ స్కాములపై కేసులు పెట్టగా, బీజేపీ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది అని తెలిపారు.ఈడీని పంపించి కేసు ఫైళ్లను అన్ని ఢిల్లీకి తీసుకెళ్లించింది ఎవరు? అని ప్రశ్నించారు.
ఫ్రీ బస్ ప్రయాణం, రైతు రుణమాఫీ, సంక్షేమ పథకాలు నచ్చితే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించలని ప్రజలను కోరారు