ఆ రూ.7581 కోట్లు ఏమైనట్టు?

– 97.87 శాతం రూ.2000 కరెన్సీ నోట్లు వెనక్కి
– పలు వాయిదాలు ముగిసినా వెనక్కి రాని రూ.7581 కోట్లు

నిర్దేశం, న్యూఢిల్లీ: రద్దయిన రూ.2000 నోట్లు 97.87% బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా సోమవారం వెల్లడించింది. అయితే రూ.7,581 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. 2023 మే 19న చలామణిలో నుంచి రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికీ రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు వాడుకలో ఉండగా.. ఈ ఏడాది జూన్‌ 28 నాటికి అందులో రూ.7,581 కోట్లు తగ్గిందని తాజాగా పేర్కొంది. గతేడాది అక్టోబరు 7వ తేదీ వరకు 2 వేల నోట్లను అన్ని బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించారు.

వాస్తవానికి ఆర్బీఐ పలుమార్లు నోట్ల మార్పిడీకి అవకాశం కల్పించినప్పటికీ మొత్తం కరెన్సీ వెనక్కి రాలేదు. ఇప్పటికీ రూ.7,581 కోట్ల విలువైన కరెన్సీ ప్రజల వద్ద ఉందని ఆర్బీఐ చెబుతున్నప్పటికీ, ఆ మొత్తం అసలు ఉందా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. డబ్బులు పోవడం, చినిగిపోవడం, కాలిపోవడం లాంటివి జరుగుతుంటాయి. లేదంటే, ఏదైనా సమస్యాత్మకమైన ప్రదేశంలో ఇరుక్కుని ఉంటాయి. ఇంత మొత్తం డబ్బు ఎక్కడెక్కడ ఆగిపోయిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇదంతా ధనవంతుల సొమ్మైతే పరవాలేదు కానీ, పేదల సొమ్మైతే నష్టపోతారని ఒక నెటిజెన్ పోస్టు చేయగా.. ధనవంతులు ఎప్పుడో మార్చుకుని ఉంటారు, బహుశా పేదవారిదే అయ్యుంటుందని మరొక యూజర్ కామెంట్ చేశారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!