దాడులు ఎక్కడ జరిగాయంటే…
లాహోర్, నిర్దేశం:
ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా ఇండియన్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయ్. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్ కొనసాగుతున్నాయ్. ఇందులో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయూద్ కంచుకోట మురిడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లోని 2 ప్రాంతాలు, కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్‌కోట్, చక్రంబూ, మురిడ్కే, బహ్వల్పూర్‌లోని టార్గెట్స్‌ను ఆర్మీ చేధించింది. జైషే మహ్మద్, లష్కరే ఉగ్రసంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది ఇండియన్ ఆర్మీ.
ఇండియన్ ఆర్మీ ఎక్కడెక్కడ దాడి చేసిందంటే..
— మురిడ్కే.. ఇక్కడే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ ఉంది.. దాంతో, మిస్సైళ్లతో విరుచుకుపడింది భారత్
— బహావల్‌పూర్.. ఇక్కడ జైష్-ఎ-మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంది.. ఈ ప్రాంతంపై కూడా బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ
— ముజఫరాబాద్.. పీవోకేకి హెడ్‌క్వార్టర్ ఇది.. ఇక్కడే హిజ్బుల్ ముజాహిదీన్ బెస్ ఉంది.. ముజఫరాబాద్‌లో రెండు ప్రాంతాలను టార్గెట్ చేసింది భారత్
— కోట్లీ.. ఇక్కడున్న టెర్రర్ క్యాంప్స్‌పై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ
— ముజఫరాబాద్‌లో మరోచోట మిస్సైళ్లతో దాడి చేసింది భారత్
— గుల్‌పూర్… ఇక్కడున్న టెర్రర్ లాంచ్ ప్యాడ్‌పై దాడులు చేసింది భారత్
— సియాల్‌కోట్.. ఇక్కడ టెర్రర్ క్యాంప్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది
— చాక్‌అమ్రూ.. ఇక్కడ టెర్రర్ లాంచ్ ప్యాడ్‌పై భారత సైన్యం దాడులు చేసింది
— ఇక పీవోకేలో 5 ప్రాంతాల్లో ఎటాక్స్ చేసింది
— భీంబర్.. ఇక్కడ కూడా టెర్రర్ లాంచ్ ప్యాడ్‌పై దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ
ఇప్పటివరకు 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది ఇండియన్ ఆర్మీ. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది.
— బహావల్‌పూర్‌లో 100 కిలోమీటర్ల దూరం వరకు
— మురిడ్కేలో 30 కిలోమీటర్ల లోపలివరకు
— గుల్‌పూర్‌లో 35 కిలోమీటర్ల లోపలివరకు
— సవాయిలో 30 కిలోమీటర్ల లోపలివరకు
— బిలాల్‌లో 25 కిలోమీటర్ల లోపలివరకు
— కోట్లీలో 15 కిలోమీటర్ల లోపలివరకు
— బర్నాలలో 10 కిలోమీటర్ల లోపలివరకు
— సర్జల్‌లో 8 కిలోమీటర్ల లోపలివరకు
— మెహ్‌మూనాలో 15 కిలోమీటర్ల దూరం వరకు