నిర్దేశం: ప్రేమను ఎవరు కోరుకోరు? అయితే, స్త్రీ-పురుష సంబంధాల్లో ప్రేమ ఎంత అవసరమో, శృంగారం కూడా అంతే అవసరం. కాకపోతే, ఏ వయసులో అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపుతారు? ఎప్పుడు సన్నిహితంగా ఉండాలనుకుంటారన్న విషయం చాలా మందికి తెలియదు. దీనికి కారణం లేకపోలేదు మహిళలు తమ కోరికలను బయటి పెడితే చాలా మంది అపార్థం చేసుకుంటారన్న భయంతో ఎప్పుడూ అలా చెప్పరు.
పురుషులు-స్త్రీల మధ్య సంబంధంలో శృంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బాల్యం నుంచి కౌమారదశ వరకు, అంతకు మించి ఈ వాతావరణంలో స్త్రీలు గాఢమైన ప్రేమ, సాన్నిహిత్యాన్ని ఎప్పుడు కోరుకుంటారన్న దానిపై చాలా పరిశోధనలు జరిగాయి. అమ్మాయిలు చిన్నతనం నుండి యుక్తవయస్సులోకి అడుగుపెట్టినప్పుడు రొమాన్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతారని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదట. వివిధ వయసుల మహిళల్లో ఈ అధ్యయనం జరిగింది. కానీ దాని ఫలితాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి.
మహిళలు యుక్త వయసులో కాకుండా మధ్యవయస్సులో లోతైన సాన్నిహిత్యాన్ని కోరుకుంటారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 20 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో 70 శాతం మంది ప్రేమ, శృంగారం అనుభవించాలని కోరుకుంటారట. అయితే ఆ సమయంలో వారి మనసులో ఎన్నో భయాలు ఉంటాయి. కుటుంబ, సామాజిక పరిమితుల గురించి ఆలోచించడం ద్వారా వారు తమ కోరికలను నియంత్రిస్తారు.
అయితే 23 నుండి 35 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 30 శాతం మంది మాత్రమే కామాన్ని కోరుకుంటారు లేదా లోతైన ప్రేమను అనుభవించాలని భావిస్తారని వెల్లడైంది. ఇక 36 ఏళ్లు పైబడిన మహిళల్లో 80 శాతం మంది లోతైన ప్రేమను కోరుకుంటారట. ఈ వయస్సులోనే మహిళలు శృంగారం పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. అంటే 27-45 సంవత్సరాల మధ్య మహిళలు ఎక్కువగా శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుందని హెల్త్‌లైన్ అనే పత్రిక వెల్లడించింది. మరో అధ్యయనం 40 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఈ సెక్స్ డ్రైవ్ మహిళల్లో మరింత తీవ్రమవుతుందని చెప్పింది.