ఎమ్మెల్యేగా ఉంటే ఏదైనా చేయచ్చా..?

జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు..?
– 8 కోట్లు బకాయిల చెల్లించాలని ఆర్టీసి దండోరా
– జీవన్ మాల్ వేలం వేస్తామని హెచ్చరిక
– విద్యుత్ బిల్లులు 2 కోట్లు చెల్లించాలని ఒత్తిడి

– ఆర్టీసీ దెబ్బకు దిగోచ్చిన మాజీ ఎమ్మెల్యే

ఔను.. అధికారం ఉంటే ఏదైనా చేయచ్చు.. ఎవరినైనా శిక్షించవచ్చు.. రాజకీయాలలో మరో అడుగు ముందుకు వేసి ప్రత్యర్థులను మూడు చెరువుల నీళ్లు తాగించవచ్చు. ఇగో.. ఆర్మూర్ ఎమ్మెల్యేగా పదేళ్లు పని చేసిన ఆశన్నగారి జీవన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి.

రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం.. తాను ఆ పార్టీ ఎమ్మెల్యే.. పైగా కేసీఆర్ కు దత్త పుత్రుడిలా ప్రచారం ఉండే..

ఇంకేంది.. అధికారులు కూడా జీవన్ రెడ్డి చెప్పిందే వేదంగా చేసే వారే. పొలిటికల్ గా కూడా తాను ఆర్మూర్ ప్రాంతంలోనే కాదు హైదరాబాద్ లో తనదైన శైలిలో ఆస్తులు సంపాదించడంలో అతనిని మించిన మొనగాడు మరోకరు లేరు. ఆర్మూర్ నియోజక వర్గంలో జీవన్ రెడ్డి బాధితుల సంఖ్య పెరిగి పోవడంతో అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడి పోయారు.

జీవన్ రెడ్డిది అతి తెలివి.. దేవుడు కూడా గెలిపించలే.. 

జీవన్ రెడ్డిది అతి తెలివి.. ఎలాగైనా మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించాడు అతను. ఆర్మూర్ నియోజక వర్గంలోని పల్లెల నుంచి గ్రామీణులను తానే టూరిస్ట్ బస్సులు ఏర్పాటు చేసాడు.

వారికి అన్నీ ఖర్చులు తానే భరించి ఆర్మూర్ సిద్దుల గుట్ట నుంచి యాదగిరి గుట్టకు తీసుకెళ్లారు. దైవ సన్నిదిలో ప్రత్యేక పూజలు చేయించడం వల్ల తనకు తప్పకుండా ఓట్లు వేస్తారని జీవన్ రెడ్డి భావించారు.

కానీ.. ఆ దేవుడి వద్దకు వెళ్లిన వారు.. నెల నెల పింఛన్ లు తీసుకుంటున్న వారు ఓటు వేస్తే జీవన్ రెడ్డి గెలిచేవారే.. కానీ… ఓడి పోయారు. బీజేపీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి రాకేట్ లా దూసుకు వచ్చి జీవన్ రెడ్డిని థర్డ్ ప్లేస్ కు పరిమితం చేశారు.

ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని ఖర్చు కూడా బాగానే పెట్టారు. అయినా.. ఓటమి నుంచి తప్పించుకోలేక పోయారు. జీవన్ రెడ్డిపైన ఉన్నాన్నీ ఆరోపణలు బహుచ ఏ ప్రతినిధికి లేవు అనేది టాక్.

ఎమ్మెల్యే పదవి పోగానే…

నిజమే.. అధికారం ఉన్నప్పుడు తప్పు చేసినా ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే దమ్ములేని ప్రజాస్వామ్యం మనది. మొన్నటి వరకు ఆర్మూర్ ఎమ్మెల్యేగా పని చేసిన జీవన్ రెడ్డి ఎన్నికలలో ఓడి పోవడంతో అతని అన్యాయాలు, అక్రమాలు ఒక్కోక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద జీవన్ మాల్ 99 ఏళ్ల లీజ్ కు తీసుకోవడం అధికార దుర్వినియోగం అనేది జగమెరిగిన సత్యం.

ఆర్టీసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ లీజును తమకు అనుకూలంగా నిబంధనలు మార్చుకుని తీసుకున్నారనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు. ఇంత వరకు ఓకే.. కానీ… అతను ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో జీవన్ మాల్ నిర్మించారు. ఇందుకోసం లీజు అగ్రిమెంట్ ప్రకారం ఆర్టీసీకి జీవన్ మాల్ ప్రతి నెల లీజు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

నిర్దేశం 2323

జీవన్ మాల్ వేలం వేస్తామని ఆర్టీసీ దండోరా..

జీవన్ రెడ్డి నిర్మించిన జీవన్ మహాల్ ఆర్టీసీ సంస్థకు ఎనిమిది కోట్ల రూపాయలను బకాయి పడ్డట్లు సమాచారం. కానీ.. కింది స్థాయి ఆర్టీసీ అధికారులు బకాయిల గురించి జీవన్ రెడ్డిని ప్రశ్నిస్తే పట్టించుకోలేదని తెలిసింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలలో అతను ఓడి పోవడంతో ఆర్టీసీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

ఆర్టీసీకి చెల్లించే రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఈ క్రమంలో మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.

విద్యుత్ బకాయిలు రెండు కోట్లు..

జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. విద్యుత్ శాఖకు రూ.2 కోట్ల బకాయి ఉండడంతో గతంలో నోటీసులు అందించారు. అయితే.. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా మారిందన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలో ఆర్మూరులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని మాల్ నిర్మించారు. నిబంధనల ప్రకారం అద్దెలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదు. కరెంట్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. కానీ ఆ మాల్ లోని ధియేటర్లను.. దుకాణాలను అద్దెకు ఇవ్వడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందుతున్నారు.

కానీ ఇంత కాలం అధికారంలో ఉండటం వల్ల ఆర్టీసీ అధికారులు.. కరెంట్ ఉద్యోగులు .. గట్టిగా అడగలేకపోయారు. ఏమైనా అంటే ప్రభుత్వం వైపు నుంచి వేధింపులు ఉంటాయన్న కారణంగా ఆగిపోయారు. కానీ పది కోట్లకు పైగా రావాల్సి ఉండటంతో ప్రభుత్వం మారగానే అధికారులు కొరడా ఝుళిపించారు.

అదే సమయంలో.. ఆర్మూర్ లో ఆయన కూడా స్వయంగా ఓడిపోయారు. ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డి నిలిచారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు.

దీంతో ఇక ఆయన పవర్ పోయిందనుకుని అధికారులు బకాయిల కోసం రంగంలోకి దిగారు. తన మాల్ సీజ్ చేయడంపై జీవన్ రెడ్డి ఇంకా స్పందించలేదు. ఏకంగా పది కోట్ల రూపాయలు కట్టాల్సి ఉండటంతో ఆయన కూడా ఏమీ చెప్పడం లేదు. మీడియాకు అందుబాటులోకి రాలేదు.

కోటి 50 లక్షలు చెల్లించారు.. : ఆర్టీసీ ఎండి

ఆర్టీసీకి చెల్లించాల్సిన 8 కోట్ల బకాయలకు గాను ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోటి 50 లక్షలు చెల్లించారన్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. మరో కోటి 50 లక్షలు మరో రోజు చెల్లించడానికి గడువు అడిగితే ఇచ్చామన్నారు ఆయన.

నిబంధనల ప్రకారం ఆర్టీసీకి బకాయిలు చెల్లించక పోతే తప్పకుండా ఆస్తులను సీజ్ చేసి వసూల్ చేస్తామన్నారు సజ్జనార్.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!