నిర్దేశం: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత పెరిగింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 200 క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ రక్షణ కవచంగా పిలువబడే ఐరన్ డోమ్.. ఈ క్షిపణుల్లో చాలా వాటిని గాలిలోనే కూల్చివేసింది. ఇప్పుడు ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. దీని వల్ల ఎవరు ఎవరితో ఉన్నారు, ఏ దేశాలు ఇరాన్‌తో నిలుస్తాయి, ఏ దేశాలు ఇజ్రాయెల్‌తో నిలుస్తాయి అనే చర్చ మొదలైంది. అదే సమయంలో, భారతదేశం ఏ దేశంవైపు ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాబట్టి ఈ రెండు దేశాల యుద్ధానికి సంబంధించి భారతదేశ స్టాండ్ ఏమిటో తెలుసుకుందాం.
* ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం మధ్య, ఈ రెండు దేశాలలో నివసిస్తున్న తన పౌరులకు భారతదేశం ఒక సలహా జారీ చేసింది. ఈ సమస్యపై శాంతియుత పరిష్కారానికి భారత్ అనుకూలంగా ఉందని వెల్లడించింది.
- ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది
* 1988లో పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటి. అయినప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో, మధ్యప్రాచ్యంలోని పరిస్థితిపై భారతదేశం ఏ వైపుకు స్పష్టంగా మొగ్గు చూపడం లేదు.
* గత నెల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఒక తీర్మానం తీసుకు వచ్చారు. గాజా, వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ ఆక్రమణను ఒక సంవత్సరంలోగా ముగించాలని ఐరాసా కోరింది.
* అంతర్జాతీయ న్యాయస్థానం సలహా తర్వాత ఈ ప్రతిపాదన తీసుకు వచ్చారు. 193 మంది సభ్యుల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 124 సభ్య దేశాలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి.
* ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 14 దేశాలు ఓటు వేయగా, భారత్‌తో సహా 43 దేశాలు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
బ్రిక్స్ లో ఇండియా మాత్రమే ఓట్ వేయలేదు
BRICS సమూహంలో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. అయితే బ్రిక్స్ గ్రూపులో ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఏకైక దేశం భారత్. తమ రక్షణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇది అత్యాధునిక సాంకేతికతలు, ఆయుధాల పరంగా అగ్ర దేశంగా వెలుగొందుతోంది. ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ 24.4 బిలియన్ డాలర్లు.