న్యాయ వాదుల ఎన్నికలలో ఐక్యత లేక ఓడి పోయాం..
– న్యాయవాది బీఆర్ క్రిష్ణా ముదిరాజ్
నిర్దేశం, హైదరాబాద్ :
– రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ న్యాయవాదుల ప్రెసిడెంట్ ఎన్నికల సంఘంలో ఓడి పోవడానికి ముదిరాజుల, గంగ పుత్రుల, బెస్టోల న్యాయవాదుల మధ్య ఐక్యత లేక పోవడమే అన్నారు సీనియర్ న్యాయవాది బీఆర్ క్రిష్ణా ముదిరాజ్ అన్నారు. న్యాయవాదుల ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేసిన ఎం. సుధర్శన్ ముదిరాజ్ ఓడి పోయారన్నారని ఆయన పేర్కొన్నారు. ముదిరాజుల, గంగ పుత్రుల, బెస్టోలు ఈ మూడు కులాల మధ్య విబేదాలు మరిచి పోయి కలిసి పని చేయడానికి ముందుకు రావాలన్నారు. సుధర్శన్ ముదిరాజ్ ఓడి పోవడానికి గల కారణాలను ముదిరాజుల, గంగ పుత్రుల, బెస్టోల న్యాయవాదులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముదిరాజుల, గంగ పుత్రుల, బెస్టోల కులాల గోడలను పగల కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐక్యత ఉన్నప్పుడే రాజకీయంగా మనం ఎదుగాగలమని. భవిష్యత్ లో మన పిల్లలు బాగుండటానికి నిజాయితీగా ఐక్యత కోసం కృషి చేద్దాం అన్నారు న్యాయవాది బీఆర్ క్రిష్ణా ముదిరాజ్ వివరించారు.