నిరుద్యోగ యువత మేలుకో.!! తెలంగాణను ఏలుకో…! : బిఎస్పీ

నిరుద్యోగులకు

బహుజన్ సమాజ్ పార్టీ భరోసా

 సోషల్ మీడియాతో బిజీగా ఉండే యువతను టైతన్య వంతులను చేయడానికి బిఎస్ పి కంకణం కట్టుకుంది. పేపర్ లీకేజ్ తో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని గళం ఎత్తిన వారిలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముందు వరుసలో ఉన్నారు.

హైదరాబాద్, మార్చి 19 : పేపర్ లీకేజ్ తో యువతకు అన్యాయం జరుగుతుందని వెంటనే రద్దు చేయాలని లేనిచో అమరణ నిరహర దీక్ష చేస్తానని  బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్  హెచ్చరించడంతో ప్రభుత్వం అన్ని పరీక్షలను రద్దు చేసింది. అయితే.. ఇదే ఊపుతో యువతకు బిఎస్ పి అండగా నిలుస్తోందని చెప్పడానికి విసృతంగా ప్రోగ్రాంలు చేపడుతుంది.

ఇగో.. తేది: 20-3-2023, సోమవారం, సమయం: 1:30ని॥లకు వేదిక: త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్ లో నిరుద్యోగులకు భరోసా పేరిట బిఎస్ పి ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఆ కరపత్రంలో ఇదే..

—–

నిరుద్యోగ యువత మేలుకో.!!

తెలంగాణను ఏలుకో…!

అమరవీరుల ఆకాంక్షలతో ఏర్పడ్డ త్యాగాల తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ నిరుద్యోగ యువతను ఆందోళనకు గురిచేసే విధంగా ఉన్నాయి. “నీళ్ళు, నిధులు, నియమకాలు అనే ట్యాగ్ లైన్ తో” (నిస్వార్థంగా ఆంధ్ర పెట్టుబడిదారుల పాలన పోయి స్వంత రాష్ట్రంలో స్వపరిపాలనలో) ప్రాణాలకు తెగించి లారీలకు, తూటాలకు భయపడకుండా జైలు జీవితాలను అనుభవించిన నిరుద్యోగ యువకులు సాధించిన తెలంగాణలో, తెలంగాణ నిరుద్యోగ యువత భవిత ప్రశ్నార్థకం అయిన సందర్భం.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ పోయి తొలి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పడి స్వంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయన్న విశ్వాసంతో కుటుంబాలకు దూరంగా గత తొమ్మిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ కొట్లాడితే, రాష్ట్ర ముఖ్యమంత్రి సుమారు లక్ష యాబై వేల ఉద్యోగాలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, అందులో నుండి హడావిడిగా ముప్పై వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం తెలంగాణ సమాజాన్ని ఉద్దరించినట్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలకడం జరిగింది.

కాని నేడు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) నిర్లక్ష్య వైఖరితో నిరుద్యోగ సమాజాన్ని ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంతో నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. ఇప్పటికీ ఉద్యోగాల కోసం అనేక మంది తమ ప్రాణాలను అర్పించి నోటిఫికేషన్లను సాధిస్తే, సాధించిన నోటిఫికేషన్లలో పెట్టిన పరీక్షలలో పారదర్శకత లోపించి, TSPSCలో పనిచేస్తున్న ఇంటి దొంగల కారణంగా యావత్ తెలంగాణ సమాజం తలదించుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహారిస్తున్నది.

నేటి యువత పరిస్థితి చూసినట్లయితే కారం మెతుకుల కోసం క్రాస్ రోడులో 5/- రూపాయల భోజనం ఒక పూట తింటూ, మరోక పూట తినక చెట్ల క్రింద కూర్చొని ఇంటి నుంచి తల్లిదండ్రులు పంపిస్తున్న అరకొర డబ్బులతో ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలో, నోటిఫికేషన్లు వస్తాయని ఆశతో ఎదురుచూస్తుంటే, నిరుద్యోగుల కళ్ళలో ఆనందం లేకుండా కన్నీళ్లు పెట్టిస్తున్న పరిస్థితి తెలంగాణలో చోటు చేసుకున్నది. ఇదే నా మనం కోరుకున్న బంగారు తెలంగాణ?

నిరుద్యోగ యువకుల్లారా! మీరు నిరాశ చెందకండి. యువకుల పోరాటాలతోనే సాధించిన ఈ గడ్డ మన తెలంగాణ గడ్డ. ఈ గడ్డ ఎన్నో పోరాటాలను, ఎంతో మంది పాలకులను చూసింది. ఈ గడీల పాలనకు చరమ గీతం పాడాల్సిన సందర్భం ఆసన్నమైంది. కావున మనకు అండగా 26 ఏ ఐ.పి.యస్. అధికారిగా ఉండి నాడు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన సిరిపురం యాదయ్య, ఇషాంత్ రెడ్డి, మీగడ సాయికుమార్ లాంటి అమరవీరుల శవాలను తన భుజాలతో మోసిన ధీశాలి. గురుకులాల సెక్రటరీగా ఉండి అనేక మంది పేద బిడ్డలను ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి, విప్లవాత్మక మార్పులకు నాంది పలికి, ఎంతో మందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్ది, పైలట్లుగా, సైంటిస్టులుగా తయారు చేసిన ఘనత మన RSP గారిది.

ప్రస్తుతం తన అడిషనల్ డి.జి.పి. స్థాయి ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదులుకొని పేద ప్రజల జీవితాలలో వెలుగును నింపాలని, గొప్ప ఉద్యోగ జీవితాన్ని భవిష్యత్తును వదులుకొని ప్రశ్నించే గొంతుకగా ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది.

ప్రస్తుతం TSPSC లో జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ నిరుద్యోగ యువతను నిరాశ నిస్పృహాల్లోకి నెట్టెసిన సందర్భంలో, మీకు నేనునానంటు భరోసా కల్పిస్తూ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, TSPSC నిర్వహించిన పేపర్ల లీకేజీలను ప్రశ్నిస్తూ గ్రూప్-I ను ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి అమరణ నిరహార దీక్ష చేయడం జరిగింది. దీనిపై భయపడ్డ ప్రభుత్వం వెంటనే గ్రూప్-1 ప్రిలిమనరీ ఎగ్జామ్ తోపాటు మరియు DAO, AEE లవంటి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

నిరుద్యోగుల్లారా! రండి, కలిసి రండి – మన మనోధైర్యాన్ని పెంచుకొనుటకై RSP గారు ఇచ్చే అమూల్యమైన సందేశాన్ని మరియు విలువైన సలహాలను, సూచనలను స్వీకరించి భవిష్యత్తులో జరగబోయే పరీక్షలకు సర్వసన్నద్ధమై ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనతో మమేకం కావడానికి వచ్చేస్తున్నారు. రండి… కదలి రండి..

ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుండి తరిమికొడుదాం! ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడుదాం !!

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోరాటం చేద్దాం.. బహుజనుల రాజ్యం కోసం ముందుకు కదులుదాం..అంటూ కరపత్రం ప్రింట్ చేసి యువతకు అంద చేస్తున్నారు బహుజన కార్యకర్తలు..

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!