హుస్నాబాద్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి పర్యటన

హుస్నాబాద్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి పర్యటన

హుస్నాబాద్, నిర్దేశం :

ఆక్కన్నపేట మండల కేంద్రంలోని రైతూ వేదికలో పార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లను బలోపేతం చేయడానికి పైలెట్ ప్రాజెక్టు గా ఎంచుకున్న ప్రసిద్ధ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సిఈఓ మరియు డైరెక్టర్లు మరియు అధికారులతో  జిల్లా కలెక్టర్ సమీక్షా నిర్వచించారు. ఎఫ్ బి ఓ లను వ్యాపార లావాదేవీలు, బలోపేతం చేయడానికి సూచనలు, మార్కెట్ సౌకర్యాలను అందించడం కోసం క్రీషి కల్ప ఫౌండేషన్ వాళ్ళ పనితీరును అడుగుతూ వారు నిర్ణీత వ్యవధి లోపు మార్కెట్ సౌకర్యాలను పూర్తి స్థాయిలో నేర్చుకుని స్వతహాగా చేయగలగాలి. స్థానికంగా ఏం పంటలు పండిస్తున్నారనే విషయాలను తెలుసుకుని రాష్ట్రం లొ వివిధ మార్కెట్ లొ ధరలను గూర్చి మరియు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు గుర్తించి మనం ఎలాంటివి పంటలను ఎగుమతి చేయడం లాంటి విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రసిద్ధ ఎఫ్ బీ ఓ అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలవాలి. స్టార్ట్ అప్ కంపెనీలు అందుబాటులోకి ఉన్నవాటిని స్థానిక అవసరాల మేరకు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్క డైరెక్టర్ ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలి. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు ఏది పెడితే బాగుంటదో అన్వేషణ చేయాలని సూచించారు.
ఆక్కన పేట మండలంలోని అంతకపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పాఠశాలలో నిర్మాణ్ సంస్థ  వాళ్ళ సౌజన్యంతో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న కంప్యూటర్ ల్యాబ్ పనులను పరిశీలించారు. ల్యాబ్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయని  21 కంప్యూటర్లు పాఠశాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నందున వచ్చే ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందానికి తెలిపారు. పాఠశాలలో అందిస్తున్న పలు సౌకర్యాలను తెలుపుతూ ఆయా తల్లిదండ్రులను ప్రేరేపించి ముఖ్యంగా ఈ పాఠశాలలో కాకుండా వేరే ఒక పాఠశాలలో పిల్లలు పంపించేందుకు గల కారణాలను వారి నుండి రాబట్టాలని తెలిపారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు కాసేపు ముచ్చటించారు అతి త్వరలో బోర్డు ఎగ్జామ్ ఉన్నందున ఎలాంటి ఒత్తిడి లేకుండా చదవాలని తెలిపారు. ఒత్తిడి గురికాకుండా ఉండాలంటే చదివిన సబ్జెక్ట్ క్షుణ్ణంగా ఏకాగ్రతతో చదవాలని పై స్థాయిలో వెళ్ళడానికి 10వ తరగతి ఒక పునాది లాంటిదని మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది మీకు ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చి విధంగా చదవాలని ఆల్ ద బెస్ట్ తెలిపారు.
హుస్నాబాద్ ఐఓసీలో  హుస్నాబాద్, కోహెడ మండలాల్లో రంగనాయక సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ల యొక్క కాలువల భూసేకరణ నేషనల్ హైవే పనులు ఆగిన చోట భూసేకరణ, హుస్నాబాద్ లో నిర్మించబోతున్న పలు ప్రభుత్వ భవనాల  భూసేకరణ గురించి ఆర్డీవో రామ్మూర్తి మరియు తాసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలని తెలిపారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »