బంగ్లాదేశ్ లో మైనారిటీలపై ఆగని దాడులు.. ఐరాస ఆందోళన

– ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు క్రమంగా మైనారిటీల వైపుకు
– హసీనా రాజీనామా చేసినా తగ్గని హింస
– ఇప్పటి వరకు 560 మంది మృతి

నిర్దేశం, ఢాకా: బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న సంక్షోభంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఇప్పటికే భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఖండిస్తున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి సైతం ఈ విషయమై స్పందించింది. జాతి ప్రాతిపదికన దాడులు, హింసను ప్రోత్సహించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అధికార ప్రతినిధి అన్నారు.

ఐరాసా ఏం చెప్పంది?
బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులపై ఆంటోనియో గుటెర్రెస్ డిప్యూటీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్‌ను గురువారం మాట్లాడుతూ.. ‘‘మేము ఇంతకుముందు కూడా చెప్పాం, మళ్లీ చెప్తున్నాం. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసకు ముగింపు పలకాలని మేము మరోసారి కోరుకుంటున్నాము. జాతి ఆధారిత దాడులకు లేదా జాతి ఆధారిత హింసకు మేము వ్యతిరేకం. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు అవసరమైన మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము’’ అని అన్నారు.

మైనారిటీలే లక్ష్యం
షేక్ హసీనా రాజీనామా తర్వాత కూడా బంగ్లాదేశ్‌లో హింస ఆగడం లేదు. ఇంతకుముందు ఆందోళనకారులు ప్రభుత్వం, అవామీ లీగ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. క్రమంగా ఇది బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందువులు, ఇతర మైనారిటీల వైపుకు మళ్లింది. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే అనేక హిందూ దేవాలయాలు, గృహాలు, వ్యాపారాలు ధ్వంసం చేశారు. సోమవారం, షేక్ హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్‌కు చెందిన ఇద్దరు హిందూ నాయకులు హత్యకు గురయ్యారు. సోమవారం నాడు ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ జోలార్ గాన్ ప్రధాన సభ్యుడు రాహుల్ ఆనంద్ ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. హింస కారణంగా, రాహుల్ ఆనంద్, అతని కుటుంబం వారి ఇంటి నుండి పారిపోవాల్సి వచ్చింది, ఇది వారి ప్రాణాలను కాపాడింది. హసీనాగా రాజీనామాకు ముందు బంగ్లాదేశ్ వ్యాప్తంగా 232 మరణించారు. రాజీనామా అనంతరం కూడా హింస ఆగలేదు. తాజాగా ఈ సంఖ్య 560 కి పెరిగింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!