‘ఊపిరి’ ఉన్నంత వరకు “నలుగురికి” ఉపయోగపడండి

జీవిత సత్యం

విస్తరాకు – మనిషి జీవితం
‘ఊపిరి’ ఉన్నంత వరకు “నలుగురికి” ఉపయోగపడండి

విస్తరాకుకు మనిషి జీవితానికి దగ్గరి సంబంధం ఉంది. అయినా.. మనం ఆ నిజాలను జీర్ణించుకోలేక పోతున్నాం. ఈ జీవితం విస్తరాకులా శాశ్వతం కాదని తెలిసీ కూడా ఇంకేదో కావాలని పరుగులు పెడుతున్నాం. ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తున్నాం.

కానీ.. బోజనం చేసేటప్పుడు “విస్తరాకును” ఎంతో శుభ్రంగా ఉంచుకొంటాం. నీటితో కడిగి నమస్కారం చేసుకుని ‘భోజనానికి’ కూర్చుంటాము. భోజనము తినేవరకు “ఆకుకు మట్టి” అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం ‘ఆకును’ (విస్తరిని) మడిచి ‘దూరంగా’ పడేస్తాం. “మనిషి జీవితం” కూడా అంతే ఊపిరి పోగానే “ఊరి బయట” పారేసి దహనం చేస్తాం.
‘విస్తరాకు’ పారేసినప్పుడు సంతోషపడుతుంది.

ఎందుకంటే ‘పొయేముందు ఒకరి ఆకలిని’ తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న ‘తృప్తి’ ఆకుకు ఉంటుంది. కానీ, మనిషి మాత్రం ప్రతి క్షణం డబ్బు.. డబ్బు.. డబ్బుల వెంట పడి సేవను మరిచి పోతాడు.

‘సేవ’ చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ ‘సేవ’ చేయండి. మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని “వాయిదా” వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే ‘కుండ’ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు ‘విస్తరాకుకు’ ఉన్న ‘తృప్తి’ కూడా మనకి ఉండదు. ఎంత ‘సంపాదించి’ ఏమి లాభం? ‘ఒక్కపైసా’ కూడా తీసుకు పోగలమా? కనీసం’ మన ఒంటిమీద బట్ట’ కూడా మిగలనివ్వరు. అందుకే ‘ఊపిరి’ ఉన్నంత వరకు “నలుగురికి” ఉపయోగపడే విధంగా ‘జీవించండి’…
ఇదే జీవిత పరమార్ధం

– సోషల్ మీడియా

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »