రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నల్లగొండ, నిర్దేశం:
నకిరేకల్ శివారులో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తాటికల్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన ప్రభు (26) మరో మహిళ మృతి చెందారు. సూర్యాపేట నుండి హైదరాబాదుకు బైక్ పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ హాస్పటల్ మార్చురీకి తరలించిని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మిస్టరీగా మారింది. మృతుడు ప్రభు కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో మహిళతో రోడ్డు ప్రమాదంలో మరణించడం వెనుక మృతుడి తల్లి మంగమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో సూర్యాపేటలో దావత్ ఉందని బైక్పై వెళ్ళాడు. కిరేకల్ వైపు ఎందుకు వచ్చాడో కొడుకుతో పాటు మరణించిన మహిళ ఎవరో తెలియదని మంగమ్మ అంటోంది.