జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీం కోర్టుకు ట్రంప్‌

జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీం కోర్టుకు ట్రంప్‌

వాషింగ్టన్‌, నిర్దేశం:

జన్మతః పౌరసత్వం రద్దుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పట్టుదలగా ఉన్నారు. తాజాగా తన ఆదేశాలను ఫెడరల్‌ కోర్టులు నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యాక్టింగ్‌ సొలిసిటర్‌ జనరల్‌ సారా హారిస్‌ ఈ పిటిషన్‌ సాధారణమైనదని అభివర్ణించారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక, ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగబద్ధమా..? కాదా..? అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు. ట్రంప్‌ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాయి. మేరీల్యాండ్‌, మసాచుసెట్స్‌, వాషింగ్టన్‌ రాష్టాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్‌ ఆర్డర్లు జారీ చేశాయి. ఈ ఆదేశాలు దేశ ఎగ్జిక్యూటివ్‌ విభాగాన్ని రాజ్యంగపరమైన విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ఇటీవల ట్రంప్‌ సర్కారు తొలగించిన పలువురు ప్రొబేషనరీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆరు ఏజెన్సీలకు కాలిఫోర్నియాలో న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు పుట్టినవారికి మాత్రమే కాకుండా.. అమెరికాలో జన్మించిన ప్రతిఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది.

అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు ఈ పక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే, తాజాగా ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులతో దీనికి బ్రేక్‌ పడిరది. ట్రంప్‌ ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే, తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ.. తల్లి తాత్కాలిక వీసా విూద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది. 2024 చివరినాటికి 5.4 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47 శాతం భారతీయులే. వీరిలో 34 శాతం మంది అమెరికాలో పుట్టినవారు. అయితే ట్రంప్‌ ఆర్డర్‌ రాజ్యాంగ పరిధిలోకి వస్తుందా రాదా అన్నది చర్చ చేస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »