ఐదుగురు ఐఏఎస్ ల బదిలీ
తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. సిద్ధిపేట నూతన కలెక్టర్ గా కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరిని నియమించించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ప్రస్తుత పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇంతకాలం ఆ బాధ్యతలు అదనపు హోదాలో చూస్తున్న సునీల్ శర్మను అక్కడి నుంచి రిలీవ్ చేసింది రాష్ట్ర సర్కార్. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో భారీగా బదిలీలు చేస్తున్నారు.