ఓఆర్ఆర్ టెండర్లలో వేల కోట్లు చేతులు మారాయి
: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మే 4 : ఓఆర్ఆర్ అంశంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖా మంత్రిదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తాను ఇరుక్కుపోతాననే కేటీఆర్ ముఖం చాటేశారన్నారు ఆయన. ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటి? అని ప్రశ్నించారు రేవంత్. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయని, అరవింద్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు ఆయన.
మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని సమర్థించుకుంటున్నారన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మాజర్ సంస్థపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండేది. IRBకి అప్పగించేందుకు ఓఆర్ఆర్ ను HMDA పరిధిలోకి తీసుకొచ్చారు. దీని వెనక గూడుపుఠానీ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు రెడ్డి. కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీ అభ్యంతరం చెప్పింది. NHAI నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదు.
బేస్ ప్రైస్ నిర్ణయించకుండా టెండర్ ఎవరైనా పిలుస్తారా? టోల్ గెట్ పై రోజుకు రూ.2కోట్ల ఆదాయం వస్తుంది. ఏడాదికి రూ.730 కోట్లు.. 30 ఏళ్లకు 22వేల కోట్లు ఆదాయం వస్తుంది. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు 16వేల కోట్లు బ్యాంకు రుణం వస్తుంది. కానీ ప్రభుత్వం తక్కువ ధరకే ప్రయివేటుకు కట్టబెట్టిందన్నారు ఆయన. స్విస్ ఛాలెంజ్ విధానంలో బేస్ ప్రైస్ 7388 కోట్ల తో టెండర్లకు పిలవండి. IRB కంపెనీని ముందు పెట్టి తరువాత కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇందులోకి ప్రవేశించే కుట్ర జరుగుతోంది. 30 ఏండ్లు వీళ్లే దోపిడీలకు పాల్పడుతున్నారు. బేస్ ప్రైస్ పెట్టాము కానీ చెప్పం అని అంటున్నారు. అందులో ఏమైనా దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం ఏమైనా ఉందా? బేస్ ప్రైస్ చెప్పడానికి ఏమిటి నష్టం ఏమిటని నిలదీశారు రేవంత్ రెడ్డి.
అరవింద్ కుమార్ మేం లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆర్టీఐ ప్రకారం మేం అడిగిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా? తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రయివేటుకు అమ్మడానికి వీల్లేదు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అగ్గువకే ప్రయివేటుకు కట్టబెడుతున్నారు. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కు పిర్యాదు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
సెంట్రల్ విజిలెన్స్ కమీషన్, డీవోపీటీ కు అరవింద్ కుమార్ పై ఫిర్యాదు చేస్తా, ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు పిర్యాదు చేస్తాం, ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు ఆయన. దీనికి కేటీఆర్ కారణం ఇంత జరుగుతున్నా తండ్రీ కొడుకులు కేసీఆర్ – కేటీఆర్ బయటకు వచ్చి వివరణ ఇవ్వడంలేదన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ కు అతీత శక్తులు లేవు. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదన్నారు ఆయన.