మానవత్వం మంటగలిసిన వేళ

మానవత్వం మంటగలిసిన వేళ

బతికి ఉండగానే ఆస్తులు చక్కబెట్టుకు నే నీచులు ఉన్న ఈ సమాజం

(అనం చిన్ని వెంకటేశ్వర రావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

బతికి ఉండగానే ఆస్తులు చక్కబెట్టుకు నే నీచులు ఉన్న ఈ సమాజంలో… అనా రోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహా నికి ఆస్తుల పంపక రిజిస్ట్రేషన్‌ అనంతరమే దహన సంస్కారాలు చేయాలంటూ అయిన వారే రెండ్రోజులుగా ఇంటిముందు ఉంచిన ఘటన ఇది. ఈ అమానవీయ ఘటన సూ ర్యాపేట జిల్లా, మోతె మండలంలోని సిరి కొండ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది.

అసలేం జరిగింది.?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సిరికొండకు చెందిన వెంపటి సత్యనారాయణ(63) మంగళవారం అనారో గ్యంతో మృతిచెందారు. కొన్నేళ్లుగా భార్యా భర్తల మధ్య గొడవల కారణంగా ఈయన తన సోదరుల వద్ద ఉంటున్నారు. మృతుడి భార్య భాగ్యమ్మ తన సోదరుల వద్ద ఉం టుంది. వీరికి సంతానం లేదు. ఇటీవల సత్యనారాయణ క్యాన్సర్‌ బారినపడి ఆరోగ్యం క్షీణించడంతో వైద్య చికిత్స కోసం ఈయన సోదరులు రూ.లక్షల్లో అప్పులు చేసినట్లు చెబుతున్నారు. భాగ్యమ్మకు గ్రామంలో తల్లి గారిచ్చిన సుమారు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఈమె పేరిటే ఉంది. భార్యభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భాగ్యమ్మ పేరిట ఉన్న భూమిలో ఎకరం భూమిని సత్యనారాయణ పేర రిజి స్ట్రేషన్‌ చేసేందుకు ఇటీ వల పెద్దలు నిర్ణయించి సోమవారం ధరణిలో స్లాట్‌ బుక్‌ చేశారు. మరు సటి రోజు (మంగళవా రం) ఉదయం రిజిస్ట్రే షన్‌కు సత్యనారాయణ రావలసి ఉంది.
ఇంతలోనే..
మంగళవారం ఉదయం అతడు అనారోగ్యం తో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో రంగ ప్రవేశం చేసిన సత్యనారాయణ సోదరులు తాము అన్న వైద్య ఖర్చులకు సుమారు రూ.30 లక్షలదాకా ఖర్చు చేశామని, వదిన పేరు మీద ఉన్న భూమిలో ఎకరన్నర భూమి తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని పట్టుబ ట్టారు. ధరణిలో స్లాట్‌ బుక్‌ చేసి భూమి రిజిస్ట్రేషన్‌ చేసేదాకా దహన సంస్కారాలు చేసేది లేదంటూ కార్యక్రమాలు జరగకుండా అడ్డుకున్నారు. పనిలో పనిగా భాగ్యమ్మను తాము ఇన్నాళ్లు పోషించామని, మా పేర భూమి పట్టా చేయాలంటూ భాగ్యమ్మ వదిన, మరదళ్లు, వారి పిల్లలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో తహసీల్‌ కార్యాలయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
పోలీస్టేషన్‌ లో ఫిర్యాదు..
దీంతో భాగ్యమ్మ తాను ఇన్నాళ్లుగా తలదా చుకున్న వారి బంధువుల పిల్లలపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం స్లాట్‌ బుక్‌ చేసుకున్న ఆయన సోదరులు వారిలో ఒకరి పేరిట భాగ్యమ్మ పేర ఉన్న భూమిలో ఎకరన్నర పట్టా చేయించుకున్నారు. భాగ్య మ్మ వదిన, మరదలు చెరో అరెకరం భూమి పట్టా చేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసు కున్నారు. బుధవారం సాయంత్రం గ్రామాని కి వెళ్లి సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు.
ఆర్థిక బంధాలేనా..?
ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం బంధువులంతా కలిసి మృతదేహాన్ని ఇంటి ముందు వదిలి వెళ్లడంతో కుమారుడి శవానికి వృద్ధురాలైన తల్లి ఒంటరిగా కాపలా కాయడం పలువురిని కలచివేసింది. –

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!