నిర్దేశం: ఇంతకు ముందు ఎక్కువ రోజులు సినిమా ఆడిన ఆడితే గొప్ప. కానీ, ప్రెసెంట్ ట్రండ్ ఎక్కువ వసూళ్లు సాధించడం. కొన్ని సినిమాలు విడుదలైన మొదటి రోజే 100, 200 కోట్లు సంపాదిస్తున్నాయి. ఇక అత్యధిక వసూళ్ల సినిమా అని మాట్లాడుకుంటే RRR, బాహుబలి చిత్రాల పేరు ఎవరి నోటికైనా టకీమని వచ్చేస్తుంది. నిజానికి ఈ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా సుమారు 4,000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అంతే కాదండోయ్.. సుమారు 15 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. RRR సినిమాకు కేవలం 5 కోట్ల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
అదేంటి.. ఇంత పెద్ద సినిమా మాకు తెలియకుండా ఉంటుందా? అలాంటి సినిమా ఈమధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు అనుకుంటున్నారా? నిజమే, ఈమధ్య కాలంలో విడుదలైన సినిమా కాదు అది. 64 ఏళ్ల క్రితం అంటే 1960 లో విడుదలైన సినిమా అది. బాలీవుడ్ లో రూపొందించిన ‘మొఘల్-ఎ-ఆజం’ అనే సినిమా.
మొఘల్-ఎ-ఆజం
భారతీయ చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ లేదంటే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గురించి మనం మాట్లాడుకుంటే దాని ట్యాగ్ ‘దంగల్’కి వెళుతుంది. ఈ సినిమా సుమారు 3,650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే మొఘల్-ఎ-ఆజం సినిమానే ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఆ టైంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలు సంపాదించి, ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. నిజానికి ఆ టైంలో టిక్కెట్ ధర చాలా తక్కువ. ఒకవేళ, ఆ సినిమా కనుక 2024లో విడుదలై ఉంటే 4000 కోట్ల రూపాయలు రాబట్టేది.
అధిక వసూళ్లు సాధించిన సినిమాలు
ఈ డేటా ఆధారంగా చూస్తే, ‘షోలే’ చిత్రం రెండవ స్థానంలో ఉంటుంది. అమీర్ ఖాన్ దంగల్ రూ.3,650 కోట్లతో మూడవ స్థానంలో ఉంటుంది. మిగిలిన పది చిత్రాలలో బాహుబలి ది కన్క్లూజన్, మదర్ ఇండియా, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, ఆవారా ఉంటాయి. ఇవన్నీ రూ.2000 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు.