ములుగు లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
– కాంగ్రెస్ అగ్రనేతల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
– బీజేపీ – బీఆర్ ఎస్ ఒక్కటేనని విమర్శ..
– దొరాలకు ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు..
– ప్రత్యేక రాష్ట్రం ఇస్తే రాజకీయంగా నష్టం తెలిసీ సోనియా ఇచ్చారు..
– కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆరు గ్యారంటీ పథకాలపై మొదటి సంతకం..
– కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షా కోట్లు సీఎం కేసీఆర్ దోచుకున్నారు
నిర్దేశం, ములుగు :
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ములుగు రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.
ములుగులో ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర మూడు రోజులకు నిజామాబాద్ లో ముగుస్తోంది. ములుగు లో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.
ప్రజల మెప్పు పొందిన ప్రియాంక గాంధీ స్పీచ్
ముఖ్యంగా రాష్ట్రం ఇస్తే రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ప్రజల కాంక్షను గుర్తించిన సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ప్రియాంక గాంధీ. గిరిజనులు, హరిజనులు అంటే ఇందిరా గాంధీకి ఎంతో ఇష్టమన్నారు ఆమె. ప్రధాని మోదీ – సీఎం కేసీఆర్ ఇద్దరూ అంతర్గత ఒప్పందం చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ మోసం చేసారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కులాల జనం సేకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు. ఎలక్షన్ లో ప్రజలను మభ్య పెట్టే మాటలు చెప్పి మరిచి పోతారని పేర్కొన్నారు ప్రియాంక గాంధీ. బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన వారి సమస్యలు పరిష్కారిస్తామన్నారు ఆమె. టీఆర్ ఎస్ – బీజేపీ కలిసి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్నారు ప్రియాంక. పిల్లల భవిష్యత్ కోసం, పిల్లల జాబ్ కోసం, మెరుగైన సమాజం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసారు ఆమె.
దొరాలకు – ప్రజలకు మధ్యన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
: రాహుల్ గాంధీ
ఈ ఎన్నికలు దొరాలకు – ప్రజలకు మధ్యన జరగుతుందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మాట ఇస్తే తప్పాదనే విషయాన్ని ప్రపంచానికి తెలుసు అన్నారు ఆయన. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు అని గుర్తు చేసారు. దళితులకు, గిరిజనులకు భూమి ఇస్తానని సీఎం మాట ఇచ్చి మోసం చేసారన్నారు గాంధీ. సీఎం కేసీఆర్ కాళేశ్వర్ ప్రాజెక్ట్ లో లక్షా కోట్లు దొంగిలించడని ఆరోపించారు ఆయన. రైతుల రుణ మాపీ చేశారా అంటూ ప్రశ్నించారు ఆయన. రాజస్థాన్, కర్ణాకటలో ప్రజలకు ఇచ్చిన హామిలు అమలు చేసామన్నారు రాహుల్ గాంధీ. హాస్పిటల్ సిస్టం రాజస్తాన్ లో బాగుందన్నారు ఆయన.
చత్తీస్ ఘడ్ లో రైతులకు రుణ మాపీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కర్ణాటకలో మహిళలు ఆర్టీసీలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. మేము ఏ మాట ఇచ్చిన అమలు చేస్తాం అన్నారు రాహుల్ గాంధీ. పోడు భూములు, అసైన్డ్ భూముల విషయంలో మీకు న్యాయం చేస్తాం అన్నారు అతను. తెలంగాణ ప్రజలకు ఇచ్చే ఆరు గ్యారంటీ పథకలను గుర్తు చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు ఆయన.
సమ్మక్క – సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తామన్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గిరిజన ఉత్సహం చేస్తామన్నారు ఆయన. ఈ ఎన్నికలు బీఆర్ ఎస్ – కాంగ్రెస్ మధ్యన జరుగుతున్నాయన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ – బీఆర్ ఎస్ తో పాటు ఎంఐఎం కలిసి పోయాయన్నారు. పార్లమెంట్ లో బీజేపీ ఏది కోరితే దానికి మద్దతు ఇస్తుంది బీఆర్ ఎస్ అన్నారు ఆయన. సీఎం కేసీఆర్ మీద ఐటి దాడులు లేవు.. ఈడీ కేసులు లేవు. కానీ.. నా ఎంపీ పదవి రద్దు చేశారు.. ఇల్లు తీసుకున్నారు. కానీ.. కేసీఆర్ మీద ఏ కేసులు లేవన్నారు రాహుల్ గాంధీ. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పై బీజేపీ అక్రమ కేసులు పెడుతుందన్నారు ఆయన.
బీజేపీ ఆలోచన విధానంపై దేశ వ్యాప్తంగా కోట్లాడుతాం అన్నారు ఆయన. తెలంగాణలో బీజేపీ – బీఆర్ ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ.
ఈ సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, జానారెడ్డి, మహేశ్వర్ గౌడ్, సీతక్కా తదితరులు పాల్గొన్నారు.