ఢిల్లీలో చోరీ – హైదరాబాద్ లో సేల్

ఢిల్లీలో చోరీ – హైదరాబాద్ లో సేల్

హైదరాబాద్, ఫిబ్రవరి 23, తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలతో కార్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలతో కార్లు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురిని హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.ఈ వ్యవహారంలోప్రధాన సూత్రధారులు ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

నిందితుల నుంచి రూ.2.45 కోట్ల విలువైన 18 కార్లు స్వాధీనం చేసుకున్నారు.కోల్‌కతాకు చెందిన బప్పా ఘెష్‌ కార్ల చోరీ ముఠాకు ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఢిల్లీ, హర్యానాతో పాటు దేశ రాజధాని సమీపంలోని రాష్ట్రాల్లో ఖరీదైన, కొత్తగా కొనుగోలు చేసి ఇంటి బయట పార్కింగ్‌ చేసిన వాహనాలను దొంగల ముఠా చోరీ చేస్తుంది. వాటిని కోల్‌కతా తీసుకెళ్లి ఛాసిస్‌ నంబరు సహా ప్రధాన ఆధారాలన్నీ చెరిపేస్తారు.

ఇతర రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్‌ నంబర్లతో ఆర్‌సీలు తయారు చేసి విక్రయిస్తాడు.హైదరాబాద్‌లోని జమిస్థాన్‌పూర్‌కు చెందిన ఆటో ఎలక్ట్రీషియన్‌ అబ్దుల్‌ రహీమ్‌ ఖాన్‌, ముషీరాబాద్‌కు చెందిన షానవాజ్‌హుస్సేన్‌‌లు కలీమ్‌ అనే వ్యక్తి ద్వారా బప్పాగోష్‌ను సంప్రదించారు. రహీమ్‌ ఖాన్‌ రెండు కార్లు, షానవాజ్‌ ఒకటి చొప్పున కార్లు కొన్నారు. రహీమ్‌ ద్వారా తక్కువ ధరకు కార్లు వస్తున్నట్లు తెలుసుకున్న వారాసిగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ షేక్‌ జావిద్‌ కూడా బప్పాగోష్‌ను సంప్రదించాడు. బప్పా గోష్‌ దగ్గర చోరీ చేసిన కార్లు కొన్నాడు.రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌కు చెందిన కార్ల డీలర్‌ వరికుప్పల దశరథ్‌కు ఈ కార్ల వ్యవహారం తెలిసి తెలిసి బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన కొడిమళ్ల పరిపూర్ణాచారిని సంప్రదించాడు. కొట్టేసిన కార్లను విక్రయించడంలో ఆరితేరిన పరిపూర్ణాచారి.. కార్ల డీలర్‌ దశరథ్‌కు బప్పాగోష్‌ నంబరు ఇచ్చాడు.

ఇద్దరి మధ్య బేరం కుదరడంతో బప్పా గోష్‌ నుంచి దశరథ్‌ నుంచి కార్లు కొనేవాడు. లక్డీకాపూల్‌లోని హోటల్‌లో పనిచేసే ఠాకూర్‌ శైలేందర్‌ సింగ్‌ వీరికి తోడయ్యాడు. రహీమ్‌ఖాన్‌, షానవాజ్‌, జావిద్‌, దశరథ్‌, శైలేందర్‌‌లు ముఠాగా ఏర్పడి బప్పాగోష్‌ పంపించే కార్లను నగరంలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.చోరీ చేసిన కార్ల విక్రయాల కోసం బప్పాగోష్‌ ఇక్కడి డీలర్లతో పాటు.. ఓఎల్‌ఎక్స్‌నూ వేదికగా చేసుకున్నాడు. కొనుగోలు చేసే వారికి కారు అప్పగించే సమయంలో అడ్వాన్స్‌గా కొంత నగదు తీసుకుంటారు.

ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ ఉండడంతో ఎన్‌వోసీ వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, అది ఇచ్చిన తర్వాతే మిగిలిన డబ్బు తీసుకుంటామని నమ్మిస్తారు. ఆ తర్వాత కొన్న వారికి స్పందించరు. తమకు భారీగా డబ్బులు మిగిలాయని.. కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా వారిని ఎన్‌వోసీ గురించి ఒత్తిడి చేయడం లేదు.

ఇదే అదనుగా బప్పాగోష్‌ తన ముఠా సభ్యులతో హైదరాబాద్‌లోనే వందలాది కార్లు విక్రయించినట్లు తెలుస్తోంది.చోరీ చేసిన కార్లను విక్రయిస్తున్న ముఠా చిలకలగూడకు చెందిన ఓ వ్యక్తికి నిందితులు కారు విక్రయించి ఎన్‌వోసీ ఇవ్వకుండా ఆలస్యం చేశారు. అనుమానం వచ్చిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగడంతో వీరి బండారం బయటపడింది.

ప్రస్తుతం పరారీలో ఉన్న బప్పాగోష్‌, పరిపూర్ణాచారిపై గత ఏడాది ఫిబ్రవరిలో మిర్యాలగూడలో కార్ల చోరీ కేసు నమోదైంది. అప్పట్లో నిందితుల నుంచి రూ.6 కోట్ల విలువైన 20 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్ళీ అదే బాట పట్టినట్టు గుర్తించారు

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!