సినీ ఫక్కీలో చోరీ
బాన్సువాడ, నిర్ధేశం :
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. కిరాణా షాప్ కు వెళ్లి వచ్చే సరికి కారులో ఉన్న 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. కారు డోర్ ఓపెన్ చేసి దర్జా గా దొంగతనం చేసిన సీసీ ఫుటేజీ దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఇబ్రహీంపేట్ కు చెందిన చందర్ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తున్నాడు.బ్యాంక్ నుంచి డ్రా చేసిన నగదు కారులో ఉంచి గుడికి వెళ్తూ కొబ్బరి కాయ కోసం ఓ షాప్ వద్ద ఆగాడు. షాప్ నుంచి వచ్చే లోపు 2 లక్షల నగదుతో పరారయ్యారు దొంగలు. బ్యాంక్ వద్ద రెక్కీ నిర్వహించి ఈ చోరీ కి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసిన పోలిసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.