Take a fresh look at your lifestyle.

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం.. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

0 658

కేసీఆర్ ప్రభుత్వంలో అన్యాయం..

  • న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

కేసీఆర్ ప్రభుత్వంలో ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగిన పోలీసు వ్యవస్థకు ఇప్పుడు వస్తున్న ఫిర్యాదులు తలనొప్పిగా మారాయి. నాటి పోలీసుల నిర్లక్షం వల్లే తాము న్యాయం పొందలేక పోయామని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ఇగో.. సంద్య కన్ స్ట్రక్షన్ అండ్ ఎస్టెట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సరనళ శ్రీధర్ రావు న్యాయం చేయాలని రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు.

నాడు కక్షగట్టి కేసులు పెట్టారు..

గుత్ప ఉన్నోడిదే గుర్రం.. అధికారం ఉన్నోడిదే రాజ్యం అన్నట్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో కొందరు పోలీసు అధికారులు ఇష్టానుచారంగా వ్యవహరించారు.  ఇగో.. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పోలీసు అధికారులు సంద్య కన్ స్ట్రక్షన్ అండ్ ఎస్టెట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సరనళ శ్రీధర్ రావుపై కక్ష గట్టి తప్పుడు కేసులు పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టి జైలులోనే ఉంచాలని భావించారు. కానీ.. హైకోర్టు జోక్యంతో శ్రీధర్ రావుకు పోలీసుల నుంచి ఊరట లభించింది. కానీ.. తనకు అన్యాయం జరిగిందని ఆయన ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలలు కనిపించలేవు.

విచారణ ఎలా ఉంటుంది..?

సంద్య కన్ స్ట్రక్షన్ అండ్ ఎస్టెట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సరనళ శ్రీధర్ రావు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై వెంటనే కేసులు నమోదు చేశారు సీఐ వెంకన్న. గతంలో మాదాపూర్, గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఇదే ఫిర్యాదు దారుడు శ్రీధర్ పై ఒకప్పుడు ఏకపక్షంగా వ్యవహరించిన సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు పదిహేను కేసులకు పైగానే నమోదు చేసి జైలుకు పంపారు. మరి.. ఇప్పుడు శ్రీధర్ రావు ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిందే.

నమ్మక ద్రోహం..

సంద్య కన్స్ట్రక్షన్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న కొమ్మారెడ్డి ఠాగూర్, మలికి రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి తో కలిసి తనను మోసం చేశారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంద్య కన్ స్ట్రక్షన్ అండ్ ఎస్టెట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సరనళ శ్రీధర్ రావు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం లో ఉన్న సంద్య టెక్నో 1 కమర్షియల్ భవనం లో 2021 లో ఒక అంతస్తు కొనుగోలు చేసిన మాలికి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు మొత్తం భవనం కొన్నట్టు తప్పుడు పత్రాలు సృష్టించారన్న సంద్య శ్రీధర్ రావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన కంపెనీ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న కొమ్మారెడ్డి ఠాగూర్ విష్ణు వర్ధన్ రెడ్డి తో చేతులు కలిపి తనను మోసం చేశారంటూ ఆయన ఆరోపించారు. కొమ్మారెడ్డి ఠాగూర్,మాలికి రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి, మాలికి రెడ్డి వీరభద్ర రెడ్డి, CA దాట్ల రామరాజు, హరీష్, గణేష్, ఈశ్వర్, వెంకట్ ల పై 420,406,506,r/w 120b IPC కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking