రవాణా శాఖకు మంచి పేరు తేవాలి…మంత్రి పొన్నం ప్రభాకర్

రవాణా శాఖకు మంచి పేరు తేవాలి…మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ పోలీస్ అకాడమీ లో కొత్తగా ఎంపికై నియమకపత్రాలు పొందిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్  శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్,  తెలంగాణ పోలీస్ అకాడమీ డెరైక్టర్ శ్రీనివాస్ రావు, డిప్యూటీ డెరైక్టర్ నర్మదా, కొత్తగా నియమకమైన ఏఎంవిఐలు  పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నూతనంగా ఎంపికై నియామకాలు పొంది రవాణా శాఖ కు గొప్ప పేరు తేవాలని శిక్షణ పొందడానికి వచ్చిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు. తరగతుల ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. భవిష్యత్ లో మీరంతా సమర్థవంతంగా పేరు తేవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. గతంలో నెల రోజుల పాటు శిక్షణ ఉండేది ఇప్పుడు నెలుగు నెలల పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఫీల్డ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పని చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. రవాణా శాఖ గౌరవాన్ని కాపాడుతుంది. ఉద్యోగం పొందినప్పుడు ఎలా ఉంటారో దానిని ఎప్పటికీ కంటిన్యూ చేయాలి. మీరు చేసే పని రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించేలా పని చేయాలి. ఫిట్నెస్ ఉందా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నమా లేదా అనే విధంగా పని చేయవద్దని అన్నారు.
ఈ శిక్షణ ద్వారా ప్రేమ ఆప్యాయత, కఠిన్యత ఉండాలి. ఇది కంటిన్యూ చేస్తే మీకు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రావు. రవాణా శాఖ మంచి పేరు తీసుకురండి. రవాణా శాఖ డిపార్ట్మెంట్ కి మొదటిసారి లోగో తయారు చేశాం. మీకు వాహనాలు వస్తున్నాయి. దానిపై డిపెర్టమెంట్ లోగో ఉంటుంది. రవాణా శాఖ రూల్స్ పాటించని వారు మన వాహనాలు చూసిన మన లోగో ను చూసిన భయపడాలి. నియమ నిబంధనలకు  లోబడి పని చేయండి. వారికి సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు తదితర కంపిటిషన్ పెట్టండి. ఈ ట్రైనింగ్ అయిపోయిన తరువాత ఇప్పటికే ఉద్యోగాలు పొందిన పాత వారికి 50 మంది చొప్పున ఒక బ్యాచ్ గా రెండు నెలల శిక్షణ ఉండాలి. సమాజంలో మంచి ఆఫీసర్ గా ఉండాలి. గతంలో 46 జీవో, 317 జీవో కోసం పిలిస్తే  డెరైక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టంగా చెప్పాల్సింది చెప్పేవారు. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ ఫామ్. ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్, వాహన సారథి ఆటోమేటిక్ టెస్టింగ్ డ్రైవింగ్ సెంటర్స్ ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు సమస్యలు ఏమున్న వింటాం పరిష్కారం చేస్తాం.. డిపార్ట్మెంట్ గౌరవం పెరగడం అవసరం. మరోసారి కాలేజి లో జాయిన్ అయ్యమనుకొని నేర్చుకోండి & చదువుకోండి. పూర్తి స్థాయిలో మనుసు పెట్టి శిక్షణ తోసుకొండీ. ఈ శిక్షణ మీ జీవితంలో మార్పు తెచ్చి భవిష్యత్ కి మార్గదర్శకత్వం కావాలని అన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »