అజాగ్రత్తగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితుడికి 1 సం జైలు శిక్ష తోపాటు
1,100 రూపాయల జరిమాన
జగిత్యాల, నిర్దేశం:
అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష తోపాటు 1100 రూపాయల జరిమాన విధించి జడ్జి శ్రీనిజ కొహిర్కర్ గురువారం తీర్పు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్ళితే జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతే గ్రామానికి చెందిన కల్లెడ సత్తయ్య 12 నవంబర్ 2019, రోజున అదే గ్రామానికి చెందిన ఆర్ముల్లా మధుసూదన్ అను వ్యక్తి మోతే బైపాస్ రోడ్డు దగ్గర హార్వెస్టర్ రిపేర్ నిమిత్తం సత్తయ్యని పిలవగా అక్కడికి వెళ్లిన సత్తయ్య హార్వెస్టర్ కట్టర్ బార్ ఎక్కించుతుండగా మధుసూదన్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా హార్వెస్టర్ ను అకస్మాత్తుగా ముందుకు నడపగా, హార్వెస్టర్ పెద్ద టైర్ సత్తయ్య ఎడమకాలు పై నుండి వెళ్ళగా అతనికి తీవ్ర గాయం అయ్యి హాస్పిటల్ కి తరలించారు.ఈ విషయం పై కల్లెడ సత్తయ్య జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ సిహెచ్.సతీష్ నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు.సాక్షులను విచారించిన జడ్జి శ్రీనిజ కొహిర్కర్ నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష మరియు 1100 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.