ఆ ఇద్దరి మహిళల గొడవకు కారణం..?
నిర్దేశం, నిజామాబాద్ :
అదో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ( ఎస్ సీ) ఆఫీస్.. అందులో నలుగురు మహిళా ఉద్యోగులు జాబ్ చేస్తారు. కానీ.. అందులో ఇద్దరు మహిళల మధ్య ఎప్పుడు గొడవలు పడుతుంటారనేది జగమెరిగిన సత్యం. ఇగో… మహిళా దినోత్సవం సందర్భంగా ఆ ఇద్దరు మహిళ ఉద్యోగుల మధ్య జరిగిన గొడవకు ప్రధాన కారణం అదిపత్య పోరుగా చెబుతున్నారు. సదరు మహిళ ఉద్యోగి భర్త టీఎన్ జీవో రాష్ట్ర స్థాయి నాయకులు. ఇంకేం ఉంది. ఆమె తన పై స్థాయి అధికారులు చెప్పిన పని చేయకుండా ఎదురు తిరుగడంతోనే వాళ్ల మధ్య వివాదం పెరిగింది. ‘‘నేను రాష్ట్ర స్థాయి నాయకుడి పెళ్లాంను.. నీవు పని చెబితే చేయాలా..?’’ అంటూ తోటి ఉద్యోగుల ముందే తనపై అధికారిణితో దుర్బాషలాడినట్లు తెలుస్తోంది. సదరు మహిళ ఉద్యోగిని తన భర్త పని చేసే ఆఫీస్ కు బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.