లక్ష రూపాయల రుణం అన్నీ బీసీల కులాలకు ఇవ్వాలి

 లక్ష రూపాయల రుణం అన్నీ బీసీల కులాలకు ఇవ్వాలి
: 16 బి.సి సంఘాల సమావేశం డిమాండ్

హైదరాబాద్ మే 20 :
ముఖ్యమంత్రి ప్రకటించిన ఒక లక్షా రూపాయల రుణం ప్రతి కులానికి, ప్రతి కుటుంబానికి మంజూరు చేయాలని 16 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ రోజు బి.సి భవన్ లో జరిగిన సమావేశానికి జాతీయ బి.సి సంక్షేమ సంఘ అధ్యక్షులు , రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అధ్యక్షత వహించారు.ముఖ్యమంత్రి ప్రకటించిన ఒక లక్ష రూపాయల రుణం నాలుగు కులాలకే కాకుండా బీసీ జాబితాలో యున్న 129 కులాలకు మంజూరు చేయాలని, అలాగే గత ఎన్నికలకు ముందు 2017లో రుణాలు ఇస్తామని 5 లక్షల 77 వేల మంది వద్ద దరఖాస్తులు తీసుకున్నారు.

వీరికి వెంటనే లక్ష రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. 9 సంవత్సరాలు పాలనలో ఒక బీసీ రుణం ఎందుకు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఇవ్వడం హర్షించదగ్గ పరిణామమన్నారు.ఐతే జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ – పోస్టులు ఎందుకు రద్దు చేశారు. ఇప్పుడు రుణాలు ఎవరి ద్వారా ఇస్తారని ప్రశ్నించారు. అందుకే ఈడి పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసారు. బీసీ కార్పొరేషన్లకు MD – పోస్టులు గత 9 సంవత్సరాలుగా భర్తీ చేయలేదు. వెంటనే భర్తీ చేయాలని, బిసి కమిషనర్ పోస్ట్ గత 5 సంవత్సరాలుగా భర్తీ చేయలేదు. వెంటనే భర్తీ చేయాలని,. MBC – కార్పొరేషన్ MD పోస్టు భర్తీ చేయడం లేదు. దీన్ని కూడా వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేసారు..

BC/MBC కార్పొరేషన్లకు చైర్మన్లు ఎందుకు నియమించడం లేదు. ఇన్ని సంవత్సరాలు బీసీలను నిర్లక్ష్యం చేయడమీ కాకుండా అణిచివేతాకు గురు చేశారన్నారు.- గతంలో ఒక సంవత్సరం 10 నెలల క్రితం ముఖ్యమంత్రి బిసిలకు బి.సి బందు పధకం పెట్టి 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. దానికి అతి – గతి లేదు. “బీసీ బందు” పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.ఈ సమావేశం లో రాష్ట్ర బి.సి ఐక్య వేదిక అద్యక్షులు G.అనంతయ్య, తెలంగాణా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగిడాల సుధాకర్,రాష్ట్ర బి.సి ఫ్రంట్ చైర్మన్- గోరిగే మల్లేష్ యాదవ్, తెలంగాణా బి.సి సంఘం అద్యక్షులు C.రాజేందర్, రాష్ట్ర బి.సి ప్రజా సమితి అధ్యక్షులు మధుసూదన్ , రాష్ట్ర బి.సి యువజన సంక్షేమ సంఘం – అధ్యక్షులు- నీలo వెంకటేష్, రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామ కృష్ణ , రాష్ట్ర బి.సి ఉద్యోగుల సంఘం. ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఎస్సిఎస్టి బిసి మైనారిటీ ఉద్యోగుల సంఘం చేర్మెన్ ఆరేపల్లి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!