ఎన్నికల వేళ ఆ మూడు సినిమాల ప్రభావం

ఎన్నికల వేళ ఆ మూడు సినిమాలు
– రజాకర్ మూవీని వ్యతిరేకిస్తున్నబీఆర్ఎస్..
– టీడీపీకి నష్టం చేసే ‘వ్యూహం’ మూవీ

నిర్దేశం, హైదరాబాద్ :
సినిమా ప్రభావం ప్రజలలో ఎక్కువే.. ఎలక్షన్ కు అనుకూలంగా తీసే సినిమాలైతే ప్రజలను ఆలోచింప చేస్తాయి. సామాన్యుడిని సైతం ఓటు వేయడానికి ప్రొత్సహిస్తాయి. ఇగో.. ఎలక్షన్ సమయంలో ఇప్పుడు మూడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

‘రజాకర్’ మూవీతో..
బీజేపీ తెలంగాణ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ‘రజాకర్’ మూవీ ఇప్పటికే పాలిటిక్స్‌ను షేక్ చేసింది. ట్రైలర్ విడుదల తర్వాత ఈ మూవీపై మంత్రి కేటీఆర్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో తెగువ, రజాకర్ల అకృత్యాలను ఈ సినిమాలో తెరకెక్కించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఆనాడు జరిగిన దారుణాలను ట్రైలర్ లో సూపర్ గా చూయించారని చెబుతుండగా, బీఆర్ఎస్ మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదంటోంది. ఇక బీజేపీ మాత్రం ఈ మూవీతో తమకు ప్లస్ అవుతుందని భావిస్తోంది.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముస్లీంలు
ముస్లిం మత పెద్దలు మాత్రం ముస్లింలను బూచిగా చూపుతున్నారని ఫైర్ అవుతున్నారు. అదే ఎజెండాతో ‘కశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ తెరకెక్కించారని మండి పడుతున్నారు. ఏపీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, పాలిటిక్స్‌లో ఆయన అనుసరించిన వ్యూహాలపై రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో చంద్రబాబు ఫెయిల్యూర్లను ఆర్జీవీ వెండితెరపై తెరకెక్కించారు. ఈ సినిమాకు వైసీపీ శ్రేణులు మద్దతు తెలుపుతుండగా  టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గతంలో కూడా ఆర్జీవీ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి సినిమాలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇక, వైసీపీకి మద్దతు తెలిపే ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తరచూ విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో సైతం వారి క్యారెక్టర్లను ఆర్జీవీ చేర్చారు.

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హీరోగా..
తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బీజేపీ రాజకీయాలు, సనాతన ధర్మం మూలాలు, మతం, కరోనా వైరస్ బీజేపీ డీఎన్ఏ ఒకటే అని ఈ సినిమా ద్వారా సందేశం ఇవ్వనున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే అనుసరించాల్సిన విధానాలను ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. యువత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకను తెలుసుకునేలా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు. ఇక, ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. మరి రానున్న ఎన్నికలపై ఈ మూడు సినిమాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తిగా మారింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!