నిర్దేశం, ముంబై: సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్ర ఆరోపణల అనంతరం, ఆ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్‌పై పడుతుందని వచ్చినాలు తలకిందులయ్యాయి. నిజానికి సోమవారం ఉయదం స్టాక్ మార్కెట్ స్వల్ప క్షీణతతో ట్రేడింగ్‌లో కనిపించినప్పటికీ మద్యాహ్నానికి బాగా పుంజుకుంది. 12 గంటలకు సెన్సెక్స్ మళ్లీ 80 వేలు దాటింది.
ఈరోజు ఉదయం 9 గంటలకు సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పతనంతో 79,450 స్థాయి వద్ద ప్రారంభమైంది. కాగా నిఫ్టీ కూడా దాదాపు 50 పాయింట్లు స్వల్పంగా క్షీణించగా, ఇప్పుడు 12 గంటల వరకు మార్కెట్ మళ్లీ గ్రీన్‌లో ట్రేడవుతోంది. అయితే అదానీ షేర్లు మాత్రం వరుసగా పతనమవుతున్నాయి. అదానీ సంస్థలపై హిండెన్బర్గ్ రిపోర్ట్ బాగా పడింది. గతం నుంచి అదానీని ఇది వెంటాడుతూనే ఉంది. ఆ పేరు వచ్చినప్పుడల్లా అదానీ షేర్లు పడిపోతుండడం విశేషం.
అదానీ ఈ షేర్లలో పతనం
అదానీ ఎంటర్‌ప్రైజెస్: ప్రస్తుత ధర 3100, క్షీణత ₹87.55 (2.75%)
అదానీ పోర్ట్స్: ప్రస్తుత ధర 1484, క్షీణత ₹49.10 (3.20%)
అదానీ గ్రీన్ ఎనర్జీ: ప్రస్తుత ధర 1703, క్షీణత ₹77.10 (4.33%)
అదానీ టోటల్ గ్యాస్: ప్రస్తుత ధర 809, క్షీణత ₹60.65 (6.97%)
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్: ప్రస్తుత ధర 1056, క్షీణత ₹47.50 (4.30%)
అదానీ పవర్: ప్రస్తుత ధర 654, క్షీణత ₹41.10 (5.91%)
అదానీ విల్మార్: ప్రస్తుత ధర 368, క్షీణత ₹16.55 (4.30%)
అంబుజా సిమెంట్: ప్రస్తుత ధర 622, క్షీణత ₹9.10 (1.44%)
ఏసీసీ: ప్రస్తుత ధర 2317, క్షీణత ₹34.10 (1.45%)
ఎన్డీటీవీ: ప్రస్తుత ధర 202, క్షీణత ₹5.46 (2.620)