టీచర్ ను అవమానపరిచిన మతోన్మాదులను శిక్షించాలి

ఎస్సి టీచర్ మల్లిఖార్జున్ ను కులం పేరుతో దూషించి వేధించిన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి
దుండగుల అరెస్ట్ లో జాప్యం చేయడం సరీ కాదు
మల్లిఖార్జున్ కుటుంబాన్ని పరామర్శించిన
– కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు

నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల దళిత ఉపాధ్యాయుడు మల్లిఖార్జున్ ను కులం పేరుతో దూషించి బలవంతంగా గుడికి తీసుకెళ్లి బొట్టు పెట్టించి అవమానించిన మతోన్మాద బీజేపీ ఆర్ ఎస్ ఎస్ వి హెచ్ పి దుండగులను కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.

మంగళవారం నిజామాబాద్ జిల్లా బోధన్ లో బాధిత ఉపాధ్యాయుడు మల్లి ఖార్జున్ కుటుంబాన్ని
ఈ మేరకు కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు సందర్శించి ఆయనను ఓదార్చారు.

టీచర్ మల్లికార్జున్ నుండి ఘటన పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సి టీచర్ ను బలిచ్చే గొర్రెను తీసుకెళ్లినట్లుగా బడినుండిగుడి వద్దకు బలవంతంగా మెడలు పట్టి లాక్కెళ్లి జై శ్రీరాం అనిపించారని వత్తిడితో బొట్టుపెట్టి ఆయన మనోభావాలు దెబ్బతీశారని చెప్పారు.

2022 సెప్టెంబర్ లో వినాయక చందా ఇవ్వనందుకు నాటి నుండి కక్షపెంచుకొని జనవరి 2న ఈ దుర్మార్గనికి ఒడిగట్టారని చెప్పారు కులం పేరుతో దూషించి తీవ్రమైన పరుష పదజాలంతో హేళన చేశారని విమర్శించార ఒక టీచర్ మూఢత్వాలు ఎందుకు బోధిస్తాడాని ప్రశ్నించారు?

సైన్స్ హేతువాదాన్ని మాత్రమే బోధిస్తాడని చెప్పారు సైన్స్ బోధించడం నేరం కాదన్నారు .ఓ టీచర్ నాస్తికుడిగా ఎందుకు ఉండకూడదు అన్నారు ఆచార్య దేవోభవ అని గౌరవించుకుంటామని ప్రగల్బాలు పలికే మతోన్మాదులు ఎందుకు హింసించారో చెప్పాలన్నారు.

దౌర్జన్యం చేసిన మతోన్మాద దుండగులు పై ఎస్సి ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు ప్రభుత్వ విధులకు ఆటంకపర్చిన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఎస్పీ కలెక్టర్ జోక్యం చేసుకొని ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా దుండగులను అరెస్ట్ చేయాలన్నారు.
ఎస్సి టీచర్ భయభ్రాంతులకు గురిచేశారని ఆయనకు ప్రాణభయం ఉందని ఆయన కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

కేవిపిఎస్ ఆధ్వర్యంలో అన్ని సామాజిక ప్రజాసంఘాలను కలుకొని ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు .

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ అండదండలతో ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు.

జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

ఈ కార్యక్రమములో కేవిపిఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు మల్యాల సుమన్,కొండ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు నల్వల నర్సయ్య, జిల్లా కమిటీ సభ్యులు డి శంకర్, భాస్కర్ రైతుసంఘం సీఐటీయూ వ్యవసాయ కార్మికసంఘాల జిల్లా అధ్యక్షులు ఎం గంగాధరప్ప శంకర్ గౌడ్, ఏశాల గంగాధర్ సీఐటీయూ నాయకులు సాయిలు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శశికళ తదితరులు పాల్గొన్నారు

 

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!