మీనాక్షి ఎంట్రీతో మారుతున్న సెంట్రల్ వర్శిటీ సీన్..

మినాక్షి ఎంట్రీతో మారుతున్న సెంట్రల్ వర్శిటీ సీన్..

హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం రోజురోజుకి వివాదాస్పదమవుతోంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టారన్న వార్తలపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెంట్రల్ వర్శిటీ విద్యార్ధుల నుంచి మొదలుకొని ప్రతిపక్షాలు, పర్యావరణవేత్తలు, సినీ రంగ ప్రముఖుల వరకు అంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్ధుల ఆందోళనతో పాటు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో వ్యవహారం కాస్త సీరియస్ అయ్యింది. దీంతో రేవంత్ సర్కార్ మంత్రుల కమిటీని వేసి దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని.. ఈ విషయంలో పరిస్థితి చేయిదాటిపోయిందనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో విన్పించాయట. సున్నితమైన వ్యవహారాన్ని సీఎం రేవంత్ స్మూత్ గా డీల్ చేయలేదంటూ వచ్చిన విమర్శల నేపథ్యంలో హైకమాండ్ దూతగా.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చారనేది పార్టీ ఇన్‌సైడ్ టాక్.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ భూముల వివాదంపై సీరియస్ గా దృష్టి సారించారట. హైకమాండ్ దూతగా నేరుగా సచివాలయానికి వెళ్లి మంత్రులతో సమీక్ష నిర్వహించారు మీనాక్షి.

ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో సమావేశమై కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఆరా తీశారట.భూముల యాజమాన్య హక్కుల నుంచి మొదలు  వివాదం వరకు అన్ని విషయాలను మంత్రులను అడిగి తెలుసుకున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థతో, ఆ తరువాత ప్రజా సంఘాలతో వరుస సమీవేశాలు నిర్వహించిన మీనాక్షీ నటరాజన్ దీనిపై అధిష్టానానికి నివేదిక ఇచ్చేందుకు సిద్దమయ్యారట.ఇంతవరకు బాగానే ఉన్నా..మీనాక్షీ నటరాజన్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోందట. గాంధీ భవన్ కు పరిమితం కావాల్సిన మీనాక్షి.. ఏకంగా అధికారిక సచివాలయానికి రావడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. భూముల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో అధికారికంగా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది.కానీ కేవలం పార్టీ ఇంచార్జీగా ఉన్న మీనాక్షీ నటరాజన్ మంత్రుల కమిటీతో సమీక్ష నిర్వహించడం… అదీ అధికారిక సచివాలయంలో జరగడం ఏంటని అంతా అవాక్కవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే మీనాక్షీ ఇలా చేశారా.. లేదంటే తనంతకు తానే ఈ నిర్ణయం తీసుకున్నారా అని మంత్రులు ఆరా తీస్తున్నారంట. అసలు సచివాలయంలో మీటింగ్ వెనుక ఏం జరిగింది.. దానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారంట మంత్రులు.పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న మీనాక్షీ నటరాజన్.. సచివాలయానికి వచ్చి మరీ అధికారిక సమీక్ష నిర్వహించారంటే తమ ప్రభుత్వ సమర్ధతపై అధిష్టానానికి నమ్మకం లేదా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారట మంత్రులు. అందులోను భూముల వ్యవహారాన్ని సరైన పద్దతిలో తాము డీల్ చేయలోకపోయామా అన్న డైలమాలోనూ పడ్డారట అమాత్యులు.అయితే మీనాక్షీ నటరాజన్..అధికారిక కార్యక్రమాల్లో కలగజేసుకోవడం.. భూముల వ్యవహారానికే పరిమితం అవుతారా.. లేదంటే ఇకపై అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో ఆమె తలదూరుస్తారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారట మంత్రులు. ఇలా పార్టీ ఇంచార్జీ సచివాలయానికి వచ్చి అధికారిక సమీక్ష నిర్వహించడంతో ఇప్పటికే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆందోళన చెందుతున్న ప్రభుత్వ పెద్దలు, మంత్రులు.. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంట.మొత్తానికి  భూముల వ్యవహారంలో అధిష్టాన దూతగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే ప్రభుత్వంలోనూ చర్చ నడుస్తోంది. పార్టీ వ్యవహారాల ఇంచార్జీ గాంధీ భవన్ కు పరిమితం కాకుండా సెక్రెటరియేట్ వరకు వచ్చారంటే ప్రభుత్వ సమర్ధతపై నమ్మకంలేకనా… లేదంటే తమ పాలనపై ఢిల్లీ పెద్దలకు అనుమానమా అనే ఆందోళన మంత్రుల్లో కనిపిస్తోందంట.. మరి ఈ విషయం ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడాలి..
రాహూల్ ఆరా
మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు కూడా కంచ గచ్చిబౌలి భూముల రచ్చను రాహుల్ గాంధీకి చేరవేశారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్‌ చేయగా.. హరీశ్‌రావు నేరుగా రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ఈ పరిణామాలతో కంచ గచ్చిబౌలి భూవివాదం ఢిల్లీ ఏఐసీసీ భవనాన్ని టచ్ చేసింది.అసలు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నేరుగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారట. హెచ్‌సీయూతో రాహుల్‌కు ప్రత్యేక అనుబంధం ఉండటంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫోన్ చేసి విషయంపై ఆరా తీశారట. రాహుల్‌ గాంధీ ఆదేశాలతో మీనాక్షి వెంటనే హైదరాబాద్‌కు వచ్చి మంత్రుల దగ్గర ఆ వివరాలు సేకరించారు.తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ వాస్తవానికి ఏప్రిల్ 16న హైదరాబాద్ వచ్చేందుకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతో ఆగమేఘాల మీద మీనాక్షి శుక్రవారం రాత్రే మధ్యప్రదేశ్ నుంచి రైల్లో బయలుదేరి హైదరాబాద్ వచ్చారు. శనివారం మీనాక్షి నటరాజన్ మౌనవ్రతం ఉన్నా.. తెలంగాణ సచివాలయంలో మంత్రులతో సమావేశమయ్యారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ఏం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి? హెచ్‌సీయూ విద్యార్థుల వాదన ఏంటి? ఇలా అన్ని వివరాలను సేకరించారు మీనాక్షి నజరాజన్.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »