టీచర్ వ్యవస్థకు మచ్చ తెచ్చిన పంతులమ్మ

టెన్త్ స్టూడెంట్ తో టీచర్ జంప్

ప్రేమ గుడ్డిది అంటారు పెద్దలు. ఔను.. సోషల్ మీడియా డామినెట్ చేస్తున్న నేటి కలికాలంలో ఆ ప్రేమ గుడ్డిదే కాదు ఎన్నో హింసత్మక సంఘటనలకు కారణం అవుతుంది. ఆ ప్రేమ ముసుగులో హత్యలు జరుగుతున్నాయి. వాయి వరుస మరిచి పోయి శారీరక సంబందాలు కొనసాగుతున్నాయి. ఇంకెన్నో అవంచనీయ సంఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడా మీరు చదివే వార్త మాత్రం అందరికి విద్యా  బుద్దులు ఇవ్వాల్సిన చెప్పాల్సిన టీచరమ్మ విద్యార్థితో లేసి పోయింది. నమ్మడం లేదా అయితే.. ఈ వార్త చదువండి.

హైదరాబాద్, మార్చి 4,
పాఠాలు చెప్పమ్మా టీచరమ్మా అంటే.. ఎవరూ ఊహించని రీతిలో తన విద్యార్థితో జంప్ అయ్యింది. సంచలనంగా మారిన ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చందానగర్‌కు చెందిన బాలుడు.. ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే, క్లాస్ టీచర్‌ ఆ అబ్బాయికి పాఠాలు చెప్పేందుకు బదులుగా ప్రేమ పాఠాలు చెప్పుకొచ్చింది. ఇంకేముంది.. ప్రేమకాస్తా ముదిరి.. జంపింగ్ జపాంగ్ అంటూ అతన్ని తీసుకుని పారిపోయింది. 10 రోజుల క్రితం స్కూల్ టీచర్.. ఆ విద్యార్థిని తీసుకుని పారిపోగా విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.తమ కుమారుడు కనిపించడం లేదంటూ అతని తల్లిదండ్రులు, తమ కూతురు కనిపించడం లేదంటూ అటు టీచర్ తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రాథమిక విచారణలో స్కూల్ టీచరే.. ఆ బాలుడిని తీసుకుని పారిపోయినట్లు తేలింది. గత పది రోజుల వీరిద్దరూ వివిధ ప్రాంతాలలో తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. తాజాగా వీరిని పట్టుకున్నారు. వీరిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి.. కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. కాగా, 10వ తరగతి విద్యార్థిని ఓ టీచర్ లేపుకెళ్లడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!