రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పుసుకుంట. గోగులపూడి గ్రామాలు. ఆదిలాబాద్ జిల్లాలోని బు రుగు.. మంగ్లీ. మరియు నాగర్ కర్నూల్ జిల్లా లోని అప్పాపూర్. బౌరపూర్. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో గత 10 ఏండ్లుగా నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన భూభారతి చట్టానికి గత నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ప్రారంభించి ప్రయోగాత్మకంగా అమలు చేశామని ఎలాంటి రుసుములు లేకుండా ప్రజల నుంచి దరఖాస్తులను. స్వీకరించి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం పని చేస్తుందని తెలియజేశారు. చిత్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ. గృహ నిర్మాణ శాఖ. సమాచార పౌర సంబంధాల శాఖ. స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి పి వి గౌతమ్. తదితరులు ఉన్నారు..