Take a fresh look at your lifestyle.

ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు – మంత్రి కే.టీ.ఆర్

0 173

ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు

– మంత్రి కే.టీ.ఆర్

హైదరాబాద్, మార్చి 25   ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి అదే విధంగా ఎల్బీనగర్ కుడి వైపు ఫ్లైఓవర్ కు మాల్ మైసమ్మ పేరు కూడా పెట్టడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్, పరిపాలన పట్టణ అభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. ఎల్బీనగర్ చౌరస్తాలో రూ. 32 కోట్ల వ్యయంతో చేపట్టిన కుడివైపు ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి శనివారం సాయంత్రం ప్రారంభించారు. 

తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరణం పొందిన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ చౌరస్తాకు నామకరణం చేసేందుకు వెంటనే తగు ఉత్తర్వులు జారీ చేస్తామని, అదే విధంగా కుడివైపు ఫ్లైఓవర్ మాల్ మైసమ్మ నామకరణకు ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

వచ్చే సాధారణ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, తిరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని, ఈ విషయం కాంగ్రెస్, బిజెపి నాయకులకు తెలుసునని మాట్లాడేటప్పుడు ఏదో చేపలే కాబట్టి చెపుతారు తప్ప ఆ విషయం టిఆర్ఎస్ విజయం సాధించి అధికారం లోకి వస్తుందని వారికి తెలుసునని మంత్రి అన్నారు.

ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య అధిగమించేందుకు రూ.658 కోట్ల రూపాయల వ్యయంతో 12 పనులను చేపట్టడం జరిగిందని అందులో 9 పనులు పూర్తిగా మరో మూడు పనులైనక్స్ బైరమల్ గూడ సెకండ లెవెల్ ఫ్లై ఓవర్, కుడి వైపు Clover 1, ఏడమ వైపు Clover 2 అట్టి పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని మంత్రి పేర్కొన్నారు.

నగరంలో ప్రజా రవాణా, ఆరోగ్యం దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా సమస్యల పై దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రజా రవాణా విషయంలో నాగోల్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రో రైలు పొడిగించడం అదేవిధంగా హయత్ నగర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మాణం, అక్కడి నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు కలపడం జరుగుతుందని ఇది వచ్చే ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది అన్నారు. 1200 కోట్ల తో 1000 పడకల టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ఈ నియోజక వర్గ ప్రజల తో పాటు చుట్టున్న ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని గడ్డిఅన్నారం లో నిర్మించే ఆసుపత్రికి సంవత్సరన్నర(18 నెలల) కాలంలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు.

ఈ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఇండ్ల క్రమబద్దీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, 1800 మంది గాను ఇప్పటివరకు 1400 పైగా యజమానులు దరఖాస్తు చేసుకున్నారని మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకున్న పక్షం లో క్రమబద్దీకణకు పత్రాలు త్వరలో పంపిణీ చేయాలని కోరారు మిగిలిపోయిన కాలని లను కూడా జీఓ లో చేర్చడం జరిగిందన్నారు. 58, 59 జీఓ ప్రకారం గా నగరం లో ఇప్పటివరకు లక్షా 25 వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
గతం లో ఎల్ బి నగర లో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవని ట్రాఫిక్ ఇక్కట్ల తొలగించడం జరిగిందన్నారు

ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎస్.ఎన్.డి.పి ద్వారా చేపట్టిన వరద ముంపు నివారణ పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయడం జరుగుతుందని నగరంలో ఎస్.ఎన్.డి.పి ద్వారా రూ. 985 కోట్ల రూపాయల వ్యయంతో  నగరం లో లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా చేయడం కోసం కృషి చేస్తామన్నారు.

ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇక్కట్లను కేటీఆర్ 9ముందుచూపుతోనే తొలగిపోయాయన్నారు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతోనే ఇది సాధ్యమైందని అన్నారు అటో నగర్ డంపు యార్డు పరిష్కారం చేయాలని మంత్రిని కోరారు
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి, బొగ్గారం దయానంద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కార్పొరేటర్లు వెంకటేశ్వర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి టీఎస్ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి ఎస్ ఆర్ డి పి ప్రాజెక్ట్ సి ఈ దేవానంద్ ,,యస్ సి రవీందర్ రాజు, ఇ ఇ రేణుక తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking