సోనియా గాంధీ లేడీ డాన్…కేసీఆర్ పై సెటైరికల్ పోస్ట్
సోషల్ మీడియా.. ప్రతి ఒక్కరి చేతిలో పాశుపతాస్త్రంలా మారింది. మాట తప్పిన పాలకులపై సెటరికల్ పోస్ట్ లు పెట్టి నడి రోడ్ లో నిలబెట్టడంలో ముందుంటుంది. ఇగో.. వీ6 న్యూస్ – తీన్మార్ వార్తల స్క్రీప్ట్ రైటర్ రఘు భువనగిరి తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వగానే కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులంతా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పిన ఫోటోను ఫేస్ బుక్ లో రఘు పోస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అంటూ కేసీఆర్ చేసిన ప్రసంగంపై రఘు సెటరికల్ గా ఈ కింది పోస్ట్ పెట్టారు.
నాడైనా.. నేడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెసే.
అందుకే తెలంగాణ రాంగనే ఇంటోళ్లంత ఢిల్లీకి ఉరికి లేడీ డాన్ను కలవలే.. అంతకు ముందు విలన్ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు తీసుకోలే.. ఈ లేడీ డాన్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు అని అసెంబ్లీలో సీఎం హోదాలో చెప్పలే.
– నిర్దేశం, హైదరాబాద్ :