అసెంబ్లీ ఎన్నికలలో సోషల్ మీడియా జోష్..
- తలలు పట్టుకుంటున్న నేతలు..
అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు ధ్యేయంగా బీఆర్ ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గతంలో రెండు మార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడితే.. ‘‘ తెలంగాణ ద్రోహి..’’ అని ముద్ర వేసి తీవ్ర విమర్శలు చేసే వారు.
కానీ.. ఇప్పుడు అదే కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే ‘‘ద్రోహి’’ గా ముద్ర వేసి సోషల్ మీడియా వాడుకుంటుంది. నిరుద్యోగులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. కేసీఆర్ ఫ్యామిలీ కోట్లు ఆర్జించడం ఇవన్నీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇంకో వర్గం కేసీఆర్ చేసిన అభివృద్ది పనులను చూసి ఓటు వేయాలని సోషల్ మీడియాలో కోరే వారున్నారు.
‘‘కేసీఆర్ కు ఓటు వేయండి..’’ అంటూ బిత్తిరి సత్తి, సావిత్రి అలియాస్ శివజ్యోతి చేసిన వీడియోలపై సోషల్ మీడియాలో కొందరూ తీవ్రంగా విమర్శలు చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు ఇప్పుడు సోషల్ మీడియా తలనొప్పిగా మారింది. ఎప్పుడు.. ఎవరు.. ఏ పోస్ట్ పెడుతారో ఎవరికి అర్థం కావడం లేని పరిస్థితి. సోషల్ మీడియాపై కంట్రోల్ లేక పోవడంతో సోషల్ మీడియాలో పొలిటికల్ మీడియలా మారి పోయింది.
సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పోటీ..
అసెంబ్లీ ఎన్నికలలో చావో రేవో తేల్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. యూ ట్యూబ్ లో.. ఇన్ స్టాగ్రాం.. పేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో ఆయా పార్టీలకు అనుకూలంగా ప్రకటనలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో న్యూస్ విశ్లేషణ..
యూట్యూబ్ లో న్యూస్ విశ్లేషణకు ఆదరణ పెరిగింది. క్యూ న్యూస్ యూట్యూబ్ లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రారంభించిన న్యూస్ విశ్లేషణకు లక్షలాది మంది లైవ్ లో చూడటమే ఇందుకు నిదర్శనం. అయితే.. ఇప్పుడు అలాంటి న్యూస్ విశ్లేషణ యూట్యూబ్ ఛానెల్స్ పెరిగి పోయాయి.
కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీకి అనుకూలం..
కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీకి అనుకూలంగా ఈ ఛానెల్స్ పని చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ ఎస్ కు అనుకూలంగా జర్నలిస్ట్ శంకర్, బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఛానెల్ పని చేస్తోంది. అలాగే తొలివెలుగు, కాళోజి, సైట్ న్యూస్ ఇలా ఎన్నో న్యూస్ విశ్లేషణలతో ప్రజలకు తమ దైన శైలిలో వార్త కథనాలకు తమ అభిప్రాయం జోడించి చెబుతున్నారు.
– యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్