చనిపోయిన ఉద్యోగికి షోకాజ్ నోటీసులు
హైదరాబాద్
చనిపోయిన టీచర్ కు నోటీసులు పంపిన విచిత్ర ఘటన ఇది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ జడ్పీహెచ్ఎస్ లో ఎన్ .గీత స్కూల్ అసిస్టెంట్(సోషల్)గా విధులు నిర్వహించారు. 2020లో ఆమె బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకొన్నారు. కానీ, దురదృష్టవశాత్తు క్యాన్సర్తో పోరాడి 2023, మే నెలలో చనిపోయారు. ఇది గుర్తించని విద్యాశాఖ అధికారులు 10వ తరగతి పేపర్లు దిద్దేందుకు రాలేదని షోకాజ్ నోటీసులు పంపడం గమనార్హం. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది.