Take a fresh look at your lifestyle.

17న విజయభేరీతో కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం

0 15

విజయభేరీతో కాంగ్రెస్‌
ఎన్నికల శంఖారావం
17న తుక్కుగూడలో సభ
హాజరుకానున్న ముఖ్య నేతలు
ఐదు హామీల ప్రకటన
భారీ జన సమీకరణకు నేతల సన్నాహాలు
నిర్దేశం, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని తుక్కుగూడలో ఈ నెల 17న నిర్వహించనున్న విజయభేరీ బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ సభకు కేంద్ర ముఖ్య నాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షు డు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నాయకు లు హాజరుకానున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే ఐదు హామీలను ప్రకటించనుంది. సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి జనాలను తరలిం చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకు లు ఇప్పటికీ క్షేత్రస్థాయికి వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ నిర్వ హించిన సభకంటే ఎక్కువ మందిని తరలించి సత్తాచాటాలని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నా రు.

సభ నిర్వహణకు కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. 16న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరుగుతున్నందున ముఖ్య నాయకు లంతా రెండు, మూడు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకు లు సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

తెలంగాణపై కాంగ్రెస్‌ దృష్టి
కర్ణాటకలో విజయం సాధించిన ఊపుతో కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి పెట్టింది. గతంతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి మెరుగు పడిరది. మరింత ఫోకస్‌ పెడితే అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నా రు. అంతేగాక ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలం గాణ ప్రజల ఓట్లు అడిగే హక్కు ఉందని భావిస్తున్నా రు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అండగా ఉంటారని అధిష్ఠానం భావించిం ది. కానీ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పరాజయం ఎదురైంది. కాంగ్రెస్‌ నాయకుల వైఫల్యం వల్లే విజ యం దక్కలేదు. ఈ సారి ఎలాగైనా తాము తెలం గాణ ఇచ్చామని చెబుతూ అధికారం చేజిక్కించుకోవా లని భావిస్తున్నారు.

రెండు రోజులపాటు సీడబ్ల్యూసీ సమావేశాలు
కాంగ్రెస్‌ అత్యున్నత సిడబ్ల్యూసీ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్యాడర్‌లో జోష్‌ పెంచడానికి హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సీడబ్ల్యుసీ పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశం హైదరాబాద్‌ లో నిర్వహించడం గమనార్హం. ఈ నెల 16, 17 తేదీలలో సమావేశాలు జగుతాయి. 16న మధ్యా హ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుంది. 17న ఉదయం 10.30 గంటలకు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. సాయంత్రం ఐదు గంటలకు తుక్కుగూడలో బహిరంగ సభ జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking