వెహికల్ అలెవెన్స్ కింద రూ.61 లక్షలు …

61 లక్షల ట్రావెల్ అలవెన్స్…

వెహికల్ అలెవెన్స్ కింద రూ.61 లక్షలు …

స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం .

హైదరబాద్, నిర్దేశం:
తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సిద్ధమైంది. యూనివర్సిటీ నుంచి వాహన అద్దెకు తీసుకున్న నిధులపై అడిట్ విభాగం అభ్యంతరం తెలిపిది స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారని సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌ను అద్దె కారు వివాదం చుట్టుముట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటికీ తన కారు అద్దె చెల్లింపు బిల్లులు పంపి డ్రా చేసుకున్నారని ఆడిట్‌లో తేలింది. కారుకు అద్దె పేరుతో యూనివర్శిటీ నుంచి రూ.61 లక్షల రూపాయలు బిల్లులు పెట్టి వసూలు చేసుకోవడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇటీవల వర్శిటీలో నిధుల దుర్విని యోగం, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది.

ఈ విచారణలో స్మితా సభర్వాల్ కు రూ.61 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు అధికారులు.వాహన అద్దె కింద తీసుకున్న రూ.61 లక్షల నిధులను తిరిగి చెల్లించాలని మరో రెండ్రోజుల్లో ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.2016 నుంచి 2024 వరకు సీఎంవో అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ 90 నెలలకు గాను వాహన అద్దె కింద రూ. 61 లక్షలు తీసుకున్నారు. ఈ నిధులపై అభ్యంతం వ్యక్తం చేసిన ఆడిట్ విభాగం…న్యాయ నిపుణుల సూచనల మేరకు ఆమెపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. స్మితా సభర్వాల్ తీసుకున్న కారు టీఎస్‌ 08 ఈసీ 6345 వాహనం నాన్‌ టాక్స్‌ కాదు. ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదు. ఈ వాహనం ప్రైవేటు వ్యక్తిగత వాహనం. పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో తేలింది. సీఎంవో ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది.ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పని తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇటీవల జరిపిన విచారణలో కొన్ని అవకతవకలు జరిగినట్టు తేలాయి. అందులో స్మిత సబర్వాల్ అద్దె కారు వ్యవహారం కూడా ఉంది. స్మితా సభర్వాల్‌ వాహనం అద్దెపై ఆడిట్‌ అభ్యంతరం చేయడం నిజమేనని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తెలిపారు.ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ జరిపించామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని విశ్వవిద్యాలయం పాలకవర్గం దృష్టికి వచ్చిందన్నారు. సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం, న్యాయ నిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నాయి.యూనివర్శిటీ అడిటింగ్ లో స్మితాసబర్వాల్ కు సంబంధించిన ఓ విషయం బయటపడింది. స్మితా సబర్వాల్ నెలకు రూ.63 వేలు వాహన అలెవెన్స్ తీసుకున్నట్లు అడిట్ అధికారులు గుర్తించారు. యూనివర్శిటీ నుంచి వెహికల్ అలవెన్స్ కింద మొత్తం 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకోవడంపై ఆడిట్ అధికారుల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై యూనివర్సిటీ బోర్డు మీటింగ్‎లో అధికారులు చర్చించారు. స్మితా సబర్వాల్ వర్సిటీ నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి రాబట్టాలని బోర్డు మీటింగ్ లో నిర్ణయించినట్లు సమాచారం.ఈ విషయంపై ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక అందించనున్నారు. అనంతరం స్మితా సబర్వాల్‎ కు నోటీసులు జారీ చేసి నిధులు తిరిగి రాబట్టాలని వర్సిటీ అధికారులు యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కీలక పదవుల్లో ఉన్న స్మితా సబర్వాల్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు విషయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా యూనివర్శిటీ నిధుల వ్యవహారంలో స్మితా సబర్వాల్ పేరు వినిపిస్తుంది.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »